Realme Narzo 70 Turbo 5G : అమెజాన్‌లో రియల్‌మి 5G ఫోన్‌పై అద్భుతమైన డీల్.. తక్కువ ధరకే ఎలా కొనాలంటే?

Realme Narzo 70 Turbo 5G : అమెజాన్‌లో రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా ఈ 5జీ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

Realme Narzo 70 Turbo 5G

Realme Narzo 70 Turbo 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో సరసమైన ధరకే పవర్-ప్యాక్డ్ 5G స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ లేటెస్ట్ సేల్ ద్వారా
హై పర్ఫార్మెన్స్ రియల్‌మి నార్జో 70 టర్బో 5G భారీ తగ్గింపు పొందింది. ఈ ఫోన్ కేవలం ధర రూ. 14,998కే అమ్ముడవుతోంది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : NPS Vatsalya : ఈ ప్రభుత్వ పథకంలో కేవలం రూ. 1000 పెట్టుబడితో రూ. 2.3 కోట్లు సంపాదన.. ప్రతినెలా లక్ష పెన్షన్ పొందొచ్చు.. ఇదిగో ఇలా..!

అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ గతంలో రూ. 16,998 ఉండగా, ప్రస్తుత ధర అమెజాన్‌లో రూ. 15,998కు అందుబాటులో ఉంది. అయితే, ప్రొడక్టు పేజీపై రూ. 2వేలు విలువైన డిస్కౌంట్ కూపన్ అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 14,998కు తగ్గుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెజాన్ పాత స్మార్ట్‌ఫోన్‌ వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి రూ. 16,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తుంది.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫీచర్లు :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

మల్టీ టాస్కింగ్, రోజువారీ పనులను బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ 16MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ చేయొచ్చు. 5000mAh బ్యాటరీ రోజంతా వస్తుంది. 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా సపోర్టు అందిస్తుంది.

Read Also : Repairability index : ఏసీలు, ఫ్యాన్లే కాదు.. స్మార్ట్‌ఫోన్లకు రిపేరబిలిటీ ఇండెక్స్.. రేటింగ్ విధానం ఎంతవరకు సాధ్యమంటే? ఫుల్ డిటెయిల్స్..!

8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అన్ని యాప్‌లు, గేమ్స్, మీడియా ఫైల్స్ కోసం తగినంత స్టోరేజీని అందిస్తుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5G తక్కువ ధరకే హై పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమింగ్ లేదా బ్రౌజ్ చేయడంతో పాటు స్పీడ్, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే ఉన్నాయి. ముఖ్యంగా అమోల్డ్ స్క్రీన్ ఈ ఫోన్‌ను మరింత అట్రాక్టివ్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వేగంగా ఛార్జ్ అవుతుంది. అమెజాన్‌లో ఈ డీల్ అసలు వదులుకోవద్దు.