Realme Narzo 70 Turbo 5G
Realme Narzo 70 Turbo 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తు్న్నారా? రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన ఫీచర్లతో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ డిజైన్‌ను కోరుకునే యూజర్లకు ఈ ఫోన్ ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తుంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G డిస్‌ప్లే :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఆకర్షణీయమైన విజువల్స్, ఆకర్షణీయమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. HDR సపోర్టు, 2000 నిట్ వరకు గరిష్ట ప్రకాశంతో డిస్‌ప్లే అందిస్తుంది. గేమింగ్, మల్టీమీడియా వినియోగానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ప్రాసెసర్ :
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో అమర్చిన నార్జో 70 టర్బో 5G మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-G615 MC2 GPU కలిగి ఉంది. రియల్‌మి 6050mm² కూలింగ్ ఏరియాతో స్టెయిన్‌లెస్ స్టీల్ VC కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G కెమెరా :
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ కాన్ఫిగరేషన్‌తో పవర్‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ హై-క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా కూడా ఉంది.
బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు :
ఈ రియల్‌మి ఫోన్ 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. లాంగ్ టైమ్ వినియోగంతో పాటు వేగంగా రీఛార్జింగ్ చేయొచ్చు. రియల్‌మి UI 5.0తో ఆండ్రాయిడ్ 14పై రన్ అయ్యే నార్జో 70 టర్బో 5G యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంది. అదనపు ఫీచర్లతో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ ఉన్నాయి.
ధర, వేరియంట్లు :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ అనేక కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,799, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,488కు అందుబాటులో ఉంది. టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
రియల్‌మి ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్ : ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుపై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
స్పెషల్ ధర ఆఫర్ : స్పెషల్ ధర ఆఫర్‌లో భాగంగా క్యాష్‌బ్యాక్, కూపన్‌లతో సహా అదనంగా రూ. 5,779 డిస్కౌంట్
నో-కాస్ట్ EMI : నెలకు రూ. 500 నుంచి EMI ఆప్షన్లతో కొనుగోలు చేయొచ్చు.
Note : కచ్చితమైన ఆఫర్ల కోసం దయచేసి సంబంధిత వెబ్‌సైట్‌లను చెక్ చేయండి. ఎందుకంటే ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎప్పకప్పుడు మారుతుంటాయి.