అమెజాన్ ఫెస్టివల్ సేల్ : Redmi 7A, iPhone 6S ధర తగ్గిందోచ్

ఫెస్టివల్ సీజన్ మొదలైంది. దసరా, దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2019 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది.

  • Publish Date - September 30, 2019 / 10:17 AM IST

ఫెస్టివల్ సీజన్ మొదలైంది. దసరా, దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2019 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది.

ఫెస్టివల్ సీజన్ మొదలైంది. దసరా, దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2019 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్ ఫోన్లు, గేమ్ కన్సోల్స్, గేమింగ్ ల్యాప్ టాప్స్, వైర్ లెస్ హెడ్ ఫోన్లతో సహా ఎన్నో ఆకర్షణీయ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఎంతో ఖరీదైన స్మార్ట్ ఫోన్లను కూడా అమెజాన్ తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. 

ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 6S (32GB), ఐఫోన్ XR (64GB) ఈ రెండు మోడల్స్ పై తగ్గింపు ధరతో వరుసగా రూ.21వేల 999, రూ.44వేల 999కే ఆఫర్ చేస్తోంది. ఈ మోడల్ ఫీచర్లలో 4.7అంగుళాల రెటినా డిస్ ప్లే, హెడ్ ఫోన్ జాక్, సాలీడ్ కెమెరా ఉన్నాయి. దీనిపై iOS13 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతోంది. అమెజాన్ ఆఫర్ కింద ఈ iPhone6S ఫోన్ ధర రూ.21వేల 999కే సొంతం చేసుకోవచ్చు. 

షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి రిలీజ్ అయిన A సిరీస్ పై కూడా అమెజాన్ ఆకర్షణీయ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. Redmi 7A సిరీస్ లపై తగ్గింపు ధరతో ఆఫర్ చేస్తోంది. Redmi 7A మోడల్ ఫోన్ ధర రూ.4వేల 999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఫీచర్లలో 5.45 అంగుళాల HD+ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్, (2GB ర్యామ్ + 16GB స్టోరేజీ), 12MP కెమెరా (బ్యాక్) ఉన్నాయి. 

స్మార్ట్ ఫోన్లతో పాటు గేమ్ కన్సోల్స్ పై కూడా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. నిన్ టెండో స్విచ్ కన్సోల్ రూ.20వేల 999లకే లభ్యం అవుతోంది. నిన్ టెండో స్విచ్ లైట్ కూడా రూ.16వేల 990లకే ఆఫర్ చేస్తోంది. ప్లే స్టేషన్ 4స్లిమ్ 500GB ధర రూ.27వేల 990లకే లభిస్తోంది. వైర్ లెస్ హెడ్ ఫోన్లలో బోస్ సౌండ్ స్పోర్ట్ ఫ్రీ, జబ్రా ఎలైట్ యాక్టివ్ 65టీలపై ధర రూ.13వేల 289, రూ.11వేల 999గా ఆఫర్ చేస్తోంది.