Redmi Note 14 Pro Plus (Image Credit To Original Source)
Redmi Note 14 Pro Plus : రెడ్‌మి ఫోన్ ఆఫర్ అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కన్నా ముందే రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ.2,500 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఈ రెడ్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫ్లిప్‌కార్ట్ ధర :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.30,999 ఉండగా ఇప్పుడు రూ.2,679 తగ్గింపుతో రూ.28,320కు లభిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4వేలు (5శాతం) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Redmi Note 14 Pro Plus (Image Credit To Original Source)
బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్‌తో ఈ రెడ్‌మి ఫోన్ ధర రూ.24,320కి తగ్గుతుంది. అదనంగా, నెలకు రూ.996 నుంచి ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది. మీ పాత ఫోన్లు ఎక్స్ఛేంజ్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ ట్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా రూ. 23,400 వరకు ట్రేడ్ చేయవచ్చు.
Read Also : Apple iPhone 16 : సూపర్ ఆఫర్ బ్రో.. ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫీచర్లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 6.67-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా అందిస్తోంది.
అలాగే, 512GB స్టోరేజ్, 12GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 సీపీయూ ఉన్నాయి. 6,200mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ కూడా ఉంది. ఈ గాడ్జెట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాతో మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.