Apple iPhone 16 : సూపర్ ఆఫర్ బ్రో.. ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Apple iPhone 16 : జనవరి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే ఆపిల్ ఐఫోన్ 16 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 16 (Image Credit To Original Source)
- ఆపిల్ ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్
- జనవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్
- ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర కేవలం రూ. 69,900
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ 16 కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో సెప్టెంబర్ 20, 2024న ఐఫోన్ 16 లాంచ్ కాగా ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఆపిల్ A18 చిప్‌సెట్ కూడా అందిస్తుంది.
512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో మల్టీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 48MP ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. ముఖ్యంగా, ఫ్లిప్‌కార్ట్‌లో మరో 12 గంటల్లో రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభమవుతుంది. ఈ సేల్ కన్నా ముందే ప్రస్తుత డిస్కౌంట్లతో ఐఫోన్ 16 తక్కువ ధరకే లభిస్తోంది. ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
డిస్కౌంట్, ఆఫర్లు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 69,900 ధరకు లభిస్తోంది. అదనంగా, 7శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 64,900 ధరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు 5శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఐఫోన్ 16తో ఏదైనా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 53,200 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. మరో 12 గంటల్లో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. అడ్వాన్స్ సేల్ ద్వారా మరింత డిస్కౌంట్ పొందవచ్చు.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
ఈ ఐఫోన్ 16 బ్యాక్ సైడ్ కొత్త వర్టికల్ లేఅవుట్‌లో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఎఫ్/1.6 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OISతో 48MP మెయిన్ సెన్సార్ f/2.2 ఎపర్చరుతో 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫొటోలు, వీడియో టూల్స్ వేగంగా కెమెరా కంట్రోల్ అందిస్తుంది.

Apple iPhone 16 (Image Credit To Original Source)
ఫ్రంట్ సైడ్ f/1.9 ఎపర్చర్‌తో 12MP ట్రూడెప్త్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 3561mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ కూడా ఉంది. USB టైప్-C పోర్ట్ ద్వారా 25W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
డిజైన్, స్పెషిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ 2556×1179 రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అంతేకాదు.. యాక్షన్ బటన్, కెమెరా ఫంక్షన్‌ల కోసం కొత్త ప్రెజర్-సెన్సిటివ్ క్యాప్చర్ బటన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఫేస్ ఐడీ సెక్యూరిటీ శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.
డిస్‌ప్లే :
ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ హెక్సా-కోర్ ఆపిల్ A18 చిప్ ద్వారా 5-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. 8GB ర్యామ్, 128GB, 256GB 512GB స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఐఫోన్ iOS18తో వస్తుంది. iOS26కు కూడా సపోర్టు ఇస్తుంది.
