మరో DTH కనెక్షన్ అవసరమా? : Jio ఫైబర్ Set-top-Box కొంటున్నారా?

రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ టెల్, టాటా స్కై సహా స్థానిక కేబుల్ ఆపరేటర్ల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

  • Publish Date - August 29, 2019 / 09:24 AM IST

రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ టెల్, టాటా స్కై సహా స్థానిక కేబుల్ ఆపరేటర్ల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ టెల్, టాటా స్కై సహా స్థానిక కేబుల్ ఆపరేటర్ల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. జియో ఫైబర్ సర్వీసు కనెక్షన్ తీసుకున్నవాళ్లకి ఇతర కేబుల్ టీవీ ప్రసారాలు వస్తాయా? ఇదివరకే కనెక్షన్ తీసుకున్న సెట్ టాప్ బాక్సుల పరిస్థితి ఏంటి? జియో ఫైబర్ సర్వీసు తీసుకున్నప్పటికీ టీవీ ప్రసారాల కోసం ఇతర డీటీహెచ్ సర్వీసులపై ఆధారాపడాలా? ఇలాంటి ఎన్నో సందేహాలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. జియో ఫైబర్ సర్వీసు కేవలం ఇంటర్నెట్ సర్వీసు మాత్రమే అందిస్తే డీటీహెచ్ సర్వీసు కోసం అదనంగా మరో నెట్ వర్క్‌ తీసుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. కానీ, నిజానికి జియో ఫైబర్ సర్వీసు ద్వారా టీవీ బ్రాడ్ క్యాస్ట్ సర్వీసు కూడా అందించనుంది. జియో ఫైబర్ సెటప్ టాప్ బాక్సులో మల్టీపుల్ సర్వీసులను ఆఫర్ చేస్తుంది. గేమింగ్ టెక్నాలజీతో పాటు కేబుల్ టీవీ ప్రసారాలను కూడా వీక్షించవచ్చు. 

All in One సర్వీసు.. :
వినియోగదారులు ఎవరైనా జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు యాక్టివేషన్ చేసుకుంటే.. వారికి ఉచితంగా జియో సెటప్ టాప్ బాక్సు (STB) ఆఫర్ చేస్తుంది. ఇతర STBలతో పోలిస్తే.. జియో STB బాక్సు పూర్తిగా డిఫరెంట్. ఎయిర్ టెల్, టాటా స్కై అందించే సెటప్ టాప్ బాక్సుల కంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జియో STBలో ఆల్ ఇన్ వన్ ఎంటర్ టైన్ మెంట్ కన్సోల్ ఆప్షన్ ఉంది. మరో విషయం ఏమిటంటే.. జియో గిగాఫైబర్ సర్వీసు తీసుకున్న వినియోగదారులు.. బ్రాడ్ బ్యాండ్, టెలిఫోన్ కాల్స్, టీవీ సర్వీసులకు వేర్వేరుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 

లోకల్ కేబుల్ ఛానళ్లు కూడా : 
జియో సెటప్ టాప్ బాక్సులో మేజర్ లోకల్ కేబుల్ ఆపరేటర్లు (LCOs) అందించే అన్ని టీవీ ఛానళ్లు వీక్షించవచ్చు. రిలయన్స్ జియో మాదిరిగా మరో DTH కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రిలయన్స్ జియోలో మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్స్ (MSOs) టెక్నాలజీ ఉంది. ఇతర ఆపరేటర్లు.. డెన్, హాత్ వే అందించే సర్వీసు మాదిరిగానే జియో సెట్ టాప్ బాక్సులో కూడా అవే ఆప్షన్లు ఉన్నాయి. అయితే టీవీ సర్వీసులో అందించే ఛానళ్ల ప్యాకులు, ప్లాన్లు సబ్ స్ర్కిప్షన్ ధరలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. 

STB – OTT సర్వీసు యాక్సస్ : 
సాంప్రదాయక టీవీ చానళ్లు మాత్రమే కాకుండా జియో ఫైబర్ కనెక్షన్ ద్వారా స్ట్రీమింగ్ యాప్ సర్వీసులను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. జియో సినిమా, జియోటీవీ, జియోసావన్ యాప్స్ ద్వారా ఓటీటీ సర్వీసులను పొందవచ్చు. ఇతర టాప్ ఓటీటీ ప్లాట్ ఫాంల సర్వీసులను కూడా ఈ జియో సెట్ టాప్ బాక్సు ద్వారా ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. గేమింగ్, వీడియో కాలింగ్, VR, MR (వర్చువల్ రియాల్టీ, మిక్స్ డ్ రియాల్టీ) సర్వీసులను కూడా STB ద్వారా అందించాలని జియో ప్లాన్ చేస్తోంది. 

4K – HD LED TV ఫ్రీ : 
ఇప్పటికే మార్కెట్లో DTH సర్వీసు అందిస్తోన్న టాటా స్కై, ఎయిర్ టెల్ ఆపరేటర్లపై జియో సెట్ టాప్ బాక్సు ఆఫర్లతో తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం డీటీహెచ్ సర్వీసుల్లో టీవీ చానళ్ల ధరలు అధికంగా ఉండటం కూడా జియో ఫైబర్ సర్వీసుకు వినియోగదారులు ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు జియో ఇప్పటికే గిగాఫైబర్ సర్వీసులో వెల్ కమ్ ఆఫర్ కింద ఉచితంగా 4K లేదా HD LED TV అందించనున్నట్టు ప్రకటించింది.