Reliance Jio : జియో యూజర్లకు భలే షాకిచ్చిందిగా.. ఆ రెండు పాపులర్ ప్లాన్లను సైలెంట్‌గా ఎత్తేసింది.. అసలు రీజన్ ఇదే!

Reliance Jio : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు సైలెంట్‌గా షాకిచ్చింది. బాగా పాపులర్ అయిన రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరు వాడే జియో ప్లాన్ ఇందులో ఏమైనా ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.

Reliance Jio Secretly Removes Two Popular Prepaid Plans

Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో తమ యూజర్లకు సడన్ షాకిచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అత్యంత పాపులర్ అయిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది. దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవలే ఎస్ఎంఎస్, కాలింగ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ (TRAI) ఆదేశంతో రిలయన్స్ జియో ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

జియో అందించే రీఛార్జ్ ప్లాన్లలో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను సైలంట్‌గా తొలగించింది. అందులో మొదటి ప్లాన్ రూ.189 ప్లాన్ కాగా, రెండోవది రూ. 479 రీఛార్జ్ ప్లాన్.. ఈ రెండు పాన్లలో వినియోగదారులు తమ సిమ్ కార్డ్‌లను యాక్టివ్‌గా ఉండేందుకు ఎంట్రీ లెవల్ ఆప్షన్‌గా ఉన్నాయి.

Read Also : Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. ఈ ప్లాన్లపై మొబైల్ డేటా ఫసక్.. కానీ, ఇలాంటి వాళ్లకు లాభం..!

జూలై 2024లో టారిఫ్ పెంపుదలకు ముందు, రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 155 ఉండగా, కానీ ఇది ఇకపై అందుబాటులో లేదు. ట్రాయ్ ఆదేశాల మేరకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో.. ఇప్పుడు పాత ప్లాన్లను తొలగించింది. అధికారిక జియో వెబ్‌సైట్‌ నుంచి కూడా పూర్తిగా ఈ రెండు ప్లాన్లను తొలగించింది. వాయిస్, ఎస్ఎంఎస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు వినియోగదారులకు వారి సిమ్ కార్డ్‌ల కోసం సుదీర్ఘ వ్యాలిడీటీతో పాటు సరసమైన ధరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, కస్టమర్‌లు, టెలికం పరిశ్రమలు సైతం వాయిస్, ఎస్ఎంఎస్-ఓన్లీ ప్లాన్‌లపై దృష్టి సారించిన నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంది.

రెండు ప్లాన్లలో ఫీచర్లు ఏంటి? :
జియో రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడీటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్, 6GB డేటాను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ల కన్నా చాలా తక్కువ ధరకే ఆఫర్ చేసింది. రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా అవసరం లేని, కాలింగ్, ఎక్కువ కాలం వ్యాలిడీటీ అవసరమయ్యే యూజర్లకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ రెండు ప్లాన్లను తొలగించడంతో జియో యూజర్లు తమ సిమ్ కార్డులను యాక్టివ్ గా ఉండేందుకు అధిక ధర ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

రిలయన్స్ జియో నిర్ణయం ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయాన్ని (ARPU) పెంచడానికి రంగం ప్రయత్నాలకు అనుగుణంగా ఉందని బహుళ పరిశ్రమ నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, జియో కస్టమర్లు అధిక ధర గల ప్లాన్‌లను ఎంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.

ఇప్పుడు కొత్త ప్లాన్లు దిక్కు.. :
రూ. 458 ధర కలిగిన జియో ప్లాన్‌లు.. 84 రోజుల వ్యాలిడిటీ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1,000 ఎస్ఎంఎస్ అందిస్తాయి. ఈ ప్లాన్ రూ. 479 ప్లాన్ కన్నా కొంచెం చౌకగా ఉన్నప్పటికీ, ఖరీదైన ప్లాన్ అందించే 6GB డేటా ఇందులో లేదు. కొన్ని పరిస్థితులలో యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర జియో వాయిస్ ఓన్లీ ప్లాన్ ధర రూ. 1,958, 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 3,600 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు.

నివేదిక ప్రకారం.. ఈ కొత్త జియో వాయిస్-ఓన్లీ ప్లాన్‌ల ముఖ్య పరిమితి ఏమిటంటే.. కస్టమర్‌లు వాటిని ఏ డేటా వోచర్‌లతో కలపలేరు. అంటే.. ఈ ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులు ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fiపై ఆధారపడవలసి ఉంటుంది. ఎలాంటి డేటా ప్రయోజనాలను పొందలేరు.

ఈ ప్లాన్లలో జియో టీవీ, సినిమా (నాన్‌- ప్రీమియం), క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. ధరలను తగ్గించిన జియో బెనిఫిట్స్ అలాగే అందిస్తూ ప్లాన్ల అందిస్తోంది. అందులో రూ.458 ప్లాన్‌ను రూ.448కు తగ్గించగా, రూ.1958 ప్లాన్‌ను రూ.1748కు తగ్గించింది.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రెండేళ్లు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్.. జియోఫైబర్ ఎయిర్ ఫైబర్ ప్లాన్లు కూడా..!