Renault Kiger : కొత్త SUV కొంటున్నారా? ఈ రెనాల్ట్ కైగర్‌పై ఏకంగా రూ. 1.25 లక్షలు డిస్కౌంట్..!
Renault Kiger : రెనాల్ట్ పాపులర్ కాంపాక్ట్ SUV కైగర్‌పై జూలై 2026లో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులు రెనాల్ట్ కైగర్‌పై రూ. 1.25 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- July 12, 2026 / 07:46 PM IST
Renault Kiger
- జూలైలో రెనాల్ట్ కైగర్ కారుపై రూ. 1.25 లక్షలు తగ్గింపు
- లీటర్ పెట్రోల్‌పై 19కి.మీ నుంచి 20.38 కి.మీ మైలేజీ
- 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు
Renault Kiger : కొత్త SUV కారు కొనాలని చూస్తున్నారా? మీకో భారీ గుడ్ న్యూస్.. రెనాల్ట్ ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌పై ఈ జూలై వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రెనాల్ట్ కైగర్‌పై రూ. 1.25 లక్షల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్లు, ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి.
డిస్కౌంట్ సంబంధించి మరిన్ని వివరాల కోసం వినియోగదారులు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. రెనాల్ట్ కైగర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డిజైన్ అదుర్స్ :
రెనాల్ట్ కైగర్ డిజైన్ స్పోర్టీగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కారు ఫ్రంట్ సైడ్ స్పెషల్ గ్రిల్, ఆకట్టుకునే ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. 205mm గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది. కఠినమైన భూభాగం, గుంతలలో కూడా ఈజీగా ప్రయాణించవచ్చు. తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఎస్ యూవీ లగ్జరీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
అత్యాధునిక క్యాబిన్ :
కారు లోపలి భాగం చాలా మోడ్రాన్, ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. క్యాబిన్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్టు ఇచ్చే 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.
Read Also : Robot Wedding : రోబో వరుడు.. రోబో వధువు.. పెళ్లి అయిపోయింది! రోబోటిక్ పెళ్లిని ఎప్పుడైనా చూశారా?
ఈ కారులో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అలాగే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, ఆకట్టుకునే యాంబియంట్ లైటింగ్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో బూట్ స్పేస్ కూడా చాలా పెద్దదిగా ఉంది.
ఈ SUV మైలేజ్ అద్భుతం :
పర్ఫార్మెన్స్ పరంగా కైగర్ 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. అందులో మొదటిది 72bhp పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. రెండోది పవర్ ఫుల్ 100bhp పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. మాన్యువల్ ఏఎంటీ, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ కారు ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 డ్రైవింగ్ మోడ్‌లలో కూడా వస్తుంది. ఈ ఎస్ యూవీ కారు సుమారుగా 19 నుంచి 20.38 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది.
సేఫ్టీ ఫీచర్లు :
భద్రత పరంగా చూస్తే.. ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది.
ఈ కారు ధర రూ. 5.81 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ ధర రూ.10.35 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కైగర్, టాటా నెక్సాన్, పంచ్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి SUVలతో ఈ కారు నేరుగా పోటీపడుతుంది.
