Robot Wedding : రోబో వరుడు.. రోబో వధువు.. పెళ్లి అయిపోయింది! రోబోటిక్ పెళ్లిని ఎప్పుడైనా చూశారా?
Robot Wedding : ఈ రోబోటిక్ వివాహం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సూట్, బూట్లు ధరించిన వరుడు, పెళ్లి గౌనులో ఉన్న వధువు తమ డాన్యులతో వేదికపై సందడి చేశారు. పూర్తి వీడియో ఓసారి చూడండి..
Robot Wedding, Russia Robot Wedding, humanoid robots, Robert, Matilda
- రష్యాలోనే ఫస్ట్ టైమ్ రోబోటిక్ వెడ్డింగ్
- పెళ్లి గౌనులో వధువు.. సూటు ధరించిన వరుడు
- రెండు రోబోలు పెళ్లి చేసుకున్న వీడియో వైరల్
Robot Wedding : రోబోలు మనుషులను శాసిస్తాయా? రాబోయేది రోబోల ప్రపంచమేనా? చూస్తుంటే అది నిజమవుతుందని అనిపిస్తోంది. ఒకప్పుడు మనిషి ఊహాల్లో మాత్రమే కనిపించిన దృశ్యం.. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా జరుగుతుందంటే నమ్ముతారా? ఏఐ ఎంత వేగంగా ప్రపంచాన్ని మార్చేస్తోందో ఈ ఒక్క సంఘటనే నిదర్శనం. ఈ కాలంలో రోబోలు కేవలం పనులే కాదు.. మన జీవితాల్లో కొత్త అధ్యాయాలకు నాంది పలుకుతున్నాయి.
రష్యా చరిత్రలోనే ఫస్ట్ రోబోటిక్ వెడ్డింగ్ :
వంటగది నుంచి యుద్ధరంగం వరకు సత్తా చాటుతున్న ఇదే రోబోలు ఇప్పుడు పెళ్లి మండపానికి కూడా చేరాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రష్యాలో దేశ చరిత్రలోనే తొలి రోబోటిక్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన వేడుకను చూసినవారంతా ‘భవిష్యత్తు ఇంత త్వరగా మన ముందుకు వచ్చేసిందా?’ అని ఆశ్చర్యపోతున్నారు.
ఈ పెళ్లిలో వధూవరులు ఇద్దరూ రోబోలే కావడం విశేషం. అయితే, ఈ వివాహాన్ని మనుషులే ఏర్పాటు చేశారు. సూట్లో ఉన్న వరుడు, పెళ్లి గౌనులో ఉన్న వధువు అతిథులతో నిండిన హాలులోకి ప్రవేశించగా కరతాళ ధ్వనులు హోరెత్తాయి. నిర్వాహకుల ప్రకారం.. రష్యా చరిత్రలో ఇదే మొట్టమొదటి రోబోటిక్ పెళ్లి. ఈ అరుదైన వివాహంలో రోబో వరుడికి ‘రాబర్ట్’ అని, రోబో వధువుకు ‘మటిల్డా’గా పేరు పెట్టారు.
ప్రత్యేక పెళ్లి దుస్తుల్లో మెరిసిన రోబోలు :
మాస్కోలోని పాపులర్ ‘పుష్కిన్ లైబ్రరీ’లో ఈ వివాహం జరిగింది. పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలోనే జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా, యూట్యూబ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడు రాబర్ట్, వధువు మటిల్డా ప్రత్యేక పెళ్లి దుస్తులు ధరించి కనిపిస్తున్నారు.
The first wedding of Unitree G1 robots took place in Moscow: blogger Robert and ballerina Matilda.🤣 pic.twitter.com/7jgAockY9L
— Gennady Simanovsky (@GennadySimanovs) July 10, 2026
Read Also : Redmi Note 17 Series : భారీ బ్యాటరీ.. అదిరే కెమెరా.. రెడ్మి నోట్ 17 సిరీస్పై భారీ అంచనాలు!
వారిద్దరూ ఒకరి ముందు ఒకరు ముందుగా ప్రోగ్రామ్ చేసిన వివాహ ప్రమాణాలు చేశారు. ‘డాగ్మాటిక్’ అనే రోబోటిక్ కుక్క కూడా వార్తల్లో నిలిచింది. ‘డాగ్మాటిక్’ వివాహ కంకణాలను తీసుకుని వేదికపైకి వచ్చింది. ఆ తర్వాత, ఆ రెండు రోబోలు ఒకరికొకరు కంకణాలు తొడుక్కోగా, హోస్ట్ వారిని ‘రోబో భార్యాభర్తలు’గా ప్రకటించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రష్యాలో ఓ పండగ వేడుకల సందర్భంగా అత్యంత ప్రాచీన రష్యన్ సాంస్కృతిక సంప్రదాయంలో ఈ పెళ్లి జరిగింది. ఈ ప్రత్యేక పండుగను రష్యాలో ప్రతి ఏడాది జూలై 8న జరుపుకుంటారు.
రోబోలు నిజంగా ప్రేమలో పడ్డాయా? :
ఈ పెళ్లి వీడియో వైరల్ అయ్యాక రోబోలు మనుషులలాగే భావోద్వేగాలను వ్యక్తం చేయగలవా? లేదా అనేదానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే, ఈ రోబోలను రూపొందించిన డెవలపర్లు, నిర్వాహకులు మాత్రం ఇది కేవలం ముందుగా ప్రోగ్రామ్ చేసిన ఒక స్క్రిప్టెడ్ షో మాత్రమేనని అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి మనిషి సాయం లేకుండా వాటంతట అవే మాట్లాడగలవు.. స్వరాలను గుర్తించగలవు. మనుషుల్లానే అన్ని పనులు చేయగలవు.
