River Indie electric scooter launched at Rs 1.25 lakh, check features and specifications here
River Indie Electric Scooter : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ రివర్ఇండీ (River Indie) స్కూటర్ లాంచ్ అయింది. ప్రత్యేకమైన డిజైన్‌తో బెంగళూరులోని R& D సెంటర్‌లో బ్రాండ్ ద్వారా ఇంటర్నల్‌గా ఈ కొత్త స్కూటర్ ప్రవేశపెట్టింది. డిజైన్ పరంగా, రివర్ ఇండీ కాంపాక్ట్ సిల్హౌట్‌తో వస్తుంది. ముందు భాగంలో LED లైటింగ్‌తో కూడిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్, DRL క్లస్టర్ ఉన్నాయి. 14-అంగుళాల చక్రాలపై నడుస్తుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా అతిపెద్దది. అండర్ సీట్ స్టోరేజీ 43 లీటర్లుగా ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో అతిపెద్దది. 12 లీటర్ స్టోరేజ్‌తో వచ్చే ఫ్రంట్ గ్లోవ్ బాక్స్‌కు అదనమని చెప్పవచ్చు. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే.. బ్యాగ్‌లను యాడ్ చేసేందుకు వీలు కల్పిస్తూ అన్నివైపులా పన్నీర్ స్టేలతో వస్తుంది. ముందు భాగంలో మెటల్ క్రాష్ గార్డ్‌లు కూడా ఉన్నాయి. స్కూటర్ కిందపడినా దెబ్బతినకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి.
River Indie electric scooter launched at Rs 1.25 lakh
ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ సందర్భంగా రివర్ కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి మాట్లాడుతూ.. ‘డిజైన్-ఫస్ట్ విధానం ద్వారా వినియోగదారుల రోజువారీ జీవితాలను మెరుగుపరచడమే కంపెనీ లక్ష్యం. ఫస్ట్ ప్రొడక్టులో ఈవీ ఇండీ బోల్డ్ స్టేట్‌మెంట్.. యుటిలిటీ, లైఫ్‌స్టైల్ అనే రెండు విభిన్నమైన ఆఫర్‌లతో వస్తుంది. సరైన ప్రాక్టికాలిటీ, సామర్థ్యం, స్టైల్ మిక్స్‌తో అత్యంత తెలివైన స్కూటర్ కానుంది. ఇండీ సరికొత్త టెక్నాలజీతో వచ్చింది. డిజైన్ ఎలిమెంట్స్, టెక్నికల్ స్పెక్స్ ఇండీకి మరింత క్రేజ్ అందిస్తుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా స్ఫూర్తినిస్తుంది’ అన్నారు.
River Indie electric scooter launched at Rs 1.25 lakh
సస్పెన్షన్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్, వెనుక ట్విన్ రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ 240mm ఫ్రంట్ డిస్క్, 200mm వెనుక డిస్క్ ద్వారా రన్ అవుతుంది. ఇన్‌స్ట్రుమెంటేషన్ హై-కాంట్రాస్ట్ డిస్‌ప్లేను ఉపయోగిస్తుంది. సూర్యకాంతిలో కూడా బెస్ట్ ఆప్షన్ అందిస్తుంది. పవర్‌ట్రెయిన్ పరంగా రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 6.7kW (9bhp) ఎలక్ట్రిక్ మోటారును అందిస్తుంది.
స్కూటర్‌ను గరిష్టంగా 90kmph వేగంతో రన్ అవుతుంది. 4kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. రియల్-వరల్డ్ పరిధిని 120km అందిస్తుంది. ప్రామాణిక ఛార్జర్ 5 గంటల్లో బ్యాటరీని 80 శాతానికి నిండేలా చేస్తుంది. ఈ ఈవీ స్కూటర్‌లో ఎకో, రైడ్, రష్ మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. స్కూటర్‌కి రివర్స్ పార్కింగ్ అసిస్ట్ కూడా ఉన్నాయి.