Apple logo
Apple logo : ‘ఆపిల్’ ప్రపంచంలోనే ఎంత ప్రసిద్ధి గాంచిన సంస్థ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రాండ్ పరంగా ముందుంటుంది. ఈ సంస్థ ఉత్పత్తులపై ఉండే లోగోకి చాలా గుర్తింపు ఉంది. సగం కొరికిన ఆపిల్‌లా ఉండే సంస్థ లోగో గురించి డిఫరెంట్ కథనాలు వినిపిస్తాయి. అయితే చాలామందికి ఈ సంస్థ లోగో అలా ఉండటానికి కారణాలు తెలియకపోవచ్చును.
స్టీవ్ జాబ్స్ కి ఆపిల్ అంటే చాలా ఇష్టమట. అందుకే తన కంపెనీకి ఆ పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే కంపెనీ లోగో కొరికినట్లు ఉండటానికి కారణం అది యాపిల్ అని స్పష్టంగా చెప్పడానికేనట. ఈ లోగోని రూపొందించిన వ్యక్తి రాబ్ జానోఫ్. తను ఈ లోగో గురించి చాలా సంవత్సరాల క్రితం కొన్ని విషయాలు చెప్పాడు. స్టీవ్ జాబ్స్ ఈ లోగో డిజైన్ చేస్తున్నప్పుడు ఎటువంటి సలహాలు ఇవ్వలేదని చెప్పాడు. అయితే చూడటానికి సైజ్ డిఫరెన్స్ ఉన్నా ఆపిల్, చెర్రీ ఒకేలా ఉంటాయి కాబట్టి చూసేవారికి ఎటువంటి గందరగోళం లేకుండా క్లారిటీగా డిజైన్ చేయమని మాత్రం స్టీవ్ జాబ్స్ చెప్పారట.
అలా ఆపిల్ లోగోలో అది స్పష్టంగా ఆపిల్ అని చెప్పడానికి మాత్రమే సగం కొరికినట్లుగా డిజైన్ చేశారట. మనం చాలా వస్తువుల్ని వాడుతూ ఉంటాం. వాటిపై కంపెనీకి సంబంధించిన లోగోలు ఉంటాయి. అవి అలాగే ఎందుకు డిజైన్ చేశారని చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు.