Royal Enfield Bear 650 Launch
Royal Enfield Bear 650 Launch : కొత్త బుల్లెట్ బైక్ కొంటున్నారా? ప్రముఖ ఐకానిక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త మోడల్ ప్రవేశపెట్టింది. రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బుల్లెట్ బైక్ ధరలను కంపెనీ ధరలను ప్రకటించింది.
భారత మార్కెట్లో సరికొత్త 650సీసీ పవర్డ్ మోటార్‌సైకిల్ ధర రూ. 3.39 లక్షల నుంచి రూ. 3.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ మోడల్ పెట్రోల్ గ్రీన్, వైల్డ్ హనీ, గోల్డెన్ షాడో, టూ ఫోర్ నైన్ మొత్తం 4 కలర్ ఆప్షన్లలను కలిగి ఉంది. మిడిల్ వేరియంట్ల ధర రూ. 3.44 లక్షలు, రూ. 3.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
ఇతర ఆర్ఈ మాదిరిగా అదే 647.95సీసీ, ట్విన్-సిలిండర్ మోటారు ద్వారా పవర్ పొందుతుంది. అయితే, కొద్దిగా మార్చిన ట్యూన్‌తో వస్తుంది. పవర్ అవుట్‌పుట్ 47బీహెచ్‌పీ 56.5ఎన్ఎమ్ టార్క్ వద్ద ఉంది. ఇతర మోడల్స్ కంటే కొంచెం ఎక్కువ. స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఆఫర్ కూడా ఉన్నాయి. గెరిల్లా 450, హిమాలయన్ నుంచి టీఎఫ్టీ డిస్‌ప్లేతో వస్తుంది.
టూ-ఇన్-వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంది. ట్విన్ ఎగ్జాస్ట్ సెటప్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ మోడల్ బైక్ బరువు 216 కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 184 మిమీ, సీటు ఎత్తు 830 మిమీ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ డ్యూటీలు షోవా యూఎస్‌డీ ఫోర్క్స్, బ్యాక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ద్వారా నిర్వహిస్తుంది. అంతేకాకుండా, ముందు వైపున 130ఎమ్ఎమ్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ 115ఎమ్ఎమ్ ట్రావెల్ కూడా ఉంది.