Royal Enfield Bullet 350
Royal Enfield Bullet 350 : 2026లో కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త ఏడాదిలో అద్భుతమైన ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అతి చౌకైన ధరకే లభిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అనేది యువకులు సహా అందరూ ఇష్టపడే బైక్ ఇది.
క్లాసిక్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు కొత్త ఏడాదికి ముందు బుల్లెట్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. జీఎస్టీ తగ్గింపు తర్వాత బుల్లెట్ చౌకైన ధరకే లభిస్తోంది. ఈ మోటార్ సైకిల్ ధర, ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం.
భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.62 లక్షల నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ వేరియంట్ రూ. 2.02 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ కలర్ ఆప్షన్ బట్టి ధరలు మారుతూ ఉంటాయి. చాలా డీలర్‌షిప్‌లు ఇయర్ ఎండ్ ఆఫర్‌లను కూడా అందిస్తున్నాయి. తక్కువ డౌన్ చెల్లింపులు ఈఎంఐలతో బుల్లెట్‌కు ఫైనాన్స్ చేసుకోవచ్చు.
ఇంజిన్ పర్ఫార్మెన్స్ :
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 349cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. సుమారు 20.2bhp, 27Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హైవే రైడింగ్ రెండింటికీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 2025 మోడల్ ఇంజిన్ కలిగి ఉంది, వైబ్రేషన్‌లను తగ్గిస్తుంది. ప్రీమియం రైడ్ క్వాలిటీని అందిస్తుంది. కేవలం 195 కిలోల బరువు, హ్యాండ్లింగ్ ఈజీ, 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్-రోడ్ బెస్ట్ బైక్ కలిగి ఉంది.
మైలేజీ ఎంతంటే? :
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఫ్యూయల్ సామర్థ్యం లీటరుకు 35 కి.మీ నుంచి 40 కిలోమీటర్లుగా అంచనా. 350cc ఇంజిన్ కేటగిరీలో బెస్ట్ మంచిదని భావిస్తారు. ఫ్యూయిల్ ఇంజెక్షన్ సిస్టమ్ BS6 కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు అత్యంత ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఫీచర్లు :
ఈ బైక్ అత్యంత విలక్షణమైన ఫీచర్లలో క్లాసిక్ లుక్, స్ట్రాంగ్ మెటల్ బాడీతో అద్భుతమైన ఎగ్జాస్ట్ సౌండ్ అందిస్తుంది. బుల్లెట్ 350లో డ్యూయల్-ఛానల్ ABS,డిస్క్ బ్రేక్‌లు, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన సీటు,మెరుగైన సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. కొత్త బుల్లెట్ గతంలో మోడల్ కన్నా సున్నితమైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది.
బుల్లెట్ ఎందుకు కొనాలి?
మీరు స్టైల్, పవర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగిన బైక్ కోరుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అద్భుతమైన ఆప్షన్. ఇప్పుడు, సరసమైన ఈఎంఐలో తక్కువ ఫైనాన్సింగ్‌తో సొంతం చేసుకోవచ్చు.