Royal Enfield’s First-Ever Himalayan Electric Concept Motorcycle
Royal Enfield Himalayan Electric : ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ హిమాలయన్‌ను ఆవిష్కరించింది. మిలన్‌లో జరుగుతున్న ఈఐసీఎంఎ 2023లో కొత్త డిజైన్ కాన్సెప్ట్ లాంచ్ అయింది. ఈ కొత్త బైక్ కేవలం కాన్సెప్ట్ దశలోనే ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో కొత్త హిమాలయన్ 452ని కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త 452 ఐకానిక్ హిమాలయన్ 411 స్థానంలో వస్తుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్కామ్ 411ని మాత్రం కొనసాగించాలని కంపెనీ నిర్ణయించుకుంది.
హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ డిజైన్ :
హిమాలయన్ ఎలక్ట్రిక్ ద్వారా మొదలైన ప్రయాణం.. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలను అందించనున్నట్టు రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ టూరర్ ఎలా ఉంటుందో ఊహాత్మకంగా రూపొందించింది. కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ సరైన ఏడీవీ డిజైన్‌ను కలిగి ఉంది. రైడర్‌కు పర్యావరణంపై ఒత్తిడిని తగ్గించేలా ప్రోత్సహించేందుకు ఈ కొత్త కాన్సెప్ట్‌ను రూపొందించడంపై డిజైన్ బృందం దృష్టిపెట్టిందని కంపెనీ పేర్కొంది.
Royal Enfield Himalayan Electric Concept Motorcycle
సాంకేతిక అంశాలివే :
కంపెనీ కొత్త బ్యాటరీ బాక్స్‌తో మొత్తం ప్యాకేజీని రీడిజైన్ చేయాల్సి వచ్చింది. ఎప్పటిలానే బ్యాటరీ పనిచేస్తుంది. కంపెనీ జనరేటివ్ డిజైన్‌ను అమలు చేసిందని, ఆర్గానిక్ ఫ్లాక్స్ ఫైబర్ కాంపోజిట్ బాడీవర్క్ వంటి కొత్త మెటీరియల్‌లను పొందుపరిచినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ హిమాలయన్ గోల్డెన్ యూఎస్‌డీ ఫోర్క్‌ను కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు మొదటిది, ఓహ్లిన్స్ గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌తో పాటు, రెండూ అడ్జెస్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్రేకింగ్‌ను రెండు చివర్లలో డిస్క్‌లు ఉంటాయి. ఎస్ఎమ్ ప్రో ప్లాటినం స్పోక్ వీల్స్ 21-/17-అంగుళాల కలయికగా కనిపిస్తాయి. ఈ స్పెషిఫికేషన్లలో వాణిజ్యపరంగా ప్రారంభించే ఉత్పత్తికి సరిపోలకపోవచ్చు.
ఇంజిన్ : 411 సీసీ
మైలేజీ : 39.96 (కిలో మీటర్స్ పర్ లీటర్)
మ్యాక్స్ పవర్ : 24.31 పీఎస్ @ 6500ఆర్‌పీఎమ్
ఫ్యూయల్ కెపాసిటీ : 15+/- 0.5 లీటర్స్
గేర్స్ : 5 స్పీడ్ గేర్ మెష్
టైర్ : టైప్‌ట్యూబ్
కెర్బ్ బరువు : 199కిలోగ్రామలు
గరిష్టం టర్క్యూ : 32ఎన్ఎమ్ @4000 – 4500 ఆర్‌పీఎమ్
ఎలక్ట్రిక్ హిమాలయన్ స్పెసిఫికేషన్‌లు ఇప్పటి వరకు వెల్లడించలేదు. కొన్ని సంవత్సరాలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌ను పరిచయం చేస్తుందని భావిస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ ఇప్పటికీ ఒక భావన. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ పవర్‌ట్రెయిన్, మెకానిక్‌ల అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చేందుకు కేవలం ఒక వేదిక మాత్రమే. వాస్తవంగా లాంచ్ అనేది ఇంకా చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అన్‌వీల్ ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే కొద్ది నెలల్లో చాలా కొత్త కాన్సెప్ట్‌లను ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొంది.