RTGS సేవలు 24×7.. ఇకపై వారంలో అన్ని రోజులు.. ఎప్పటినుంచి అంటే?

  • Publish Date - October 9, 2020 / 06:16 PM IST

బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. RTGS సర్వీసులు త్వరలో 24×7 అందుబాటులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. RTGS (Real Time Gross Settlement System) సర్వీసును 24 గంటల పాటు (రౌండ్ ది క్లాక్) అందుబాటులోకి తీసుకొస్తోంది.



2020 డిసెంబర్ నుంచి RTGS సర్వీసులు (24x7x365) రోజులు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది 2019 డిసెంబర్ నెలలో National Electronic Funds Transfer (NEFT) system 24 గంటలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే.. 365 రోజుల్లో 24×7 ఎప్పుడైనా ఆన్ లైన్ లావాదేవీలు జరుపుకోవచ్చు. ప్రస్తుతం RTGS సర్వీసు మాత్రం కస్టమర్లకు ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంది.



ప్రతి నెలలో రెండో శనివారం లేదా నాల్గో శనివారం మినహా వారంలో అన్ని రోజుల్లో RTGS పనిదినాలు ఉంటాయి. ప్రపంచ పైనాన్షియల్ మార్కెట్లతో అనుసంధానమైన భారతీయ ఫైనాన్షియల్ మార్కెట్లకు పూర్తి స్థాయిలో సౌకర్యాన్ని అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా RTGS సేవలను అన్ని రోజుల్లో 24 గంటలు చేసింది.



ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) పేర్కొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో లావాదేవీలకు RTGS పేమెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్న చాలా కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా చేరిందని ఆయన అన్నారు.



మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం అనంతరం శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. 24 గంటల RTGS సౌకర్యం డిసెంబర్ 2020 నుంచి అందుబాటులోకి రానుంది. దేశంలో డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించే దిశగా 2019 జూలైలోనే NEFT, RTGS లావాదేవీలపై ఛార్జీలను ఆర్బీఐ ఎత్తివేసింది. RTGS అంటే.. రూ.2 లక్షల కంటే ఆపై పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు జరపాలంటే మాత్రం RTGS సర్వీసు ద్వారా పంపుకోవచ్చు. రూ.2లక్షల లోపు లావాదేవీల కోసం NEFT సర్వీసు ద్వారా వినియోగించుకోవచ్చు.