Samsung Galaxy S24 5G (Image Credit to Original Source)
Samsung Galaxy S24 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ S24 5G భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ దాదాపు రూ. 74,999కి లాంచ్ అయింది. ఇప్పటికీ ట్రిపుల్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్, భారీ బ్యాటరీ, అద్భుతమైన డిజైన్‌తో సహా ఇతర స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది.
ఇప్పుడు, ఈ శాంసంగ్ ఫోన్ ఎలాంటి బ్యాంక్ (Samsung Galaxy S24 5G) ఆఫర్‌లు లేకుండా రూ. 40వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీ ప్రస్తుత శాంసంగ్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఈ శాంసంగ్ 5G ఫోన్ అమెజాన్‌లో రూ.39,999కి ధరకు లభిస్తోంది. క్రెడిట్ కార్డులతో ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై రూ.35వేల ధర తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ.1,500 వరకు తగ్గించవచ్చు. నెలకు రూ.1,920 నుంచి ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ, స్టాండర్డ్ ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలపై కూడా వర్తించవచ్చు.
Samsung Galaxy S24 5G (Image Credit to Original Source)
ఆసక్తిగల కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.37,850 వరకు వాల్యూ పొందవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ వర్కింగ్ కండిషన్లు, బ్రాండ్లు, మోడల్స్, ఇతర కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్స్ ట్రా పేమెంట్ ద్వారా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.2-అంగుళాల భారీ అమోల్డ్ ప్యానెల్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చు.
8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 25W ఛార్జింగ్‌తో 4,000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.