Samsung Galaxy S24 FE : ఈ శాంసంగ్ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్.. ఇంత తక్కువలో మళ్లీ రాదు.. డోంట్ మిస్!

Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏకంగా రూ.20వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..

Samsung Galaxy S24 FE

Samsung Galaxy S24 FE : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్ (FE)పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ అయింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంపై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 40వేల లోపు ధరలో శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Read Also : Airtel Budget Plan : పండుగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్లాన్ మీకోసం.. ఫ్రీ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. 84 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లలో టోన్ డౌన్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన ఈ శాంసంగ్ ఫోన్ ప్రాసెసర్, బ్యాటరీ పరంగా వన్‌ప్లస్ 13R మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇటీవల తగ్గిన ధరలతో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర తగ్గింపు :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ మోడల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999 కాగా, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 65,999కు లభిస్తుంది. అయితే, అమెజాన్‌లో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,800 వద్ద లిస్టు అయింది.

అంతేకాకుండా, అమెజాన్‌పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రూ. 2,040 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో రూ. 2,250 డిస్కౌంట్ పొందవచ్చు. ఫలితంగా ఈ శాంసంగ్ ఫోన్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 6.7 అంగుళాల Full HD+ ఇన్ఫినిటీ-O డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్ 2400e 4ఎన్ఎమ్ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.

శాంసంగ్ ఎక్స్‌క్లిప్స్ 940 జీపీయూతో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. శాంసంగ్ S24 FE ఆండ్రాయిడ్ 14తో వన్ యూఐ 6.1తో వస్తుంది. రాబోయే నెలల్లో లేటెస్ట్ వన్ UI7 అప్‌డేట్‌ను అందుకుంటుంది. శాంసంగ్ 7 ఏళ్ల వరకు OS అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకుంటుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 8MP టెలిఫోటో సెన్సార్‌ కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP షూటర్ అందిస్తోంది.

ఈ ఫోన్ 4,700mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు.. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఫోన్‌తో అడాప్టర్ అందించడం లేదు. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ వాటర్, డస్ట్ నిరోధకత కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

Read Also : Redmi Note 14S : వారెవ్వా.. కొత్త రెడ్‌‌మి ఫోన్ ఆగయా.. కెమెరా ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

శాంసంగ్ S24 FE కొనాలా? వద్దా? :
శాంసంగ్ ఫోన్లలో రూ. 40వేల లోపు ఫోన్ కోసం చూసే ఎవరికైనా గెలాక్సీ S24 FE అద్భుతమైన ఆప్షన్. ఈ శాంసంగ్ ఫోన్‌కు పోటీగా వన్‌ప్లస్ 13R మార్కెట్లోకి వచ్చింది. ఈ వన్‌ప్లస్ పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ (అడాప్టర్‌) అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 FE కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ IP68 రేటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. వన్‌ప్లస్ 13Rలో ఈ బెనిఫిట్ లేదని చెప్పాలి. ధర, ఫీచర్ల ఆధారంగా ఈ రెండింటిలో మీకు నచ్చిన అన్ని ఫీచర్లు ఉన్నాయి..