×
Ad

Samsung Galaxy S24 : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు.. డోంట్ మిస్!

Samsung Galaxy S24 : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. మల్టీఫేస్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

1/6
Samsung Galaxy S24 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? దీపావళి పండగ వస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్స్ అందిస్తున్నాయి. దీపావళి సేల్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ S24పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
2/6
ఈ ప్రీమియం శాంసంగ్ ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్. ఇలాంటి డీల్స్ ఎక్కువరోజులు ఉండవు. శాంసంగ్ అభిమానులు అయితే అసలు మిస్ చేసుకోవద్దు. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిస్కౌంట్లతో శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 డీల్ : 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ ప్లాట్‌ఫామ్‌లో అసలు లాంచ్ ధర రూ. 74,999కు బదులుగా రూ. 39,999కు అందుబాటులో ఉంది. అంతేకాదు, కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,950 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 38,540కి తగ్గుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే, ఒనిక్స్ బ్లాక్ అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4/6
శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా పొందుతుంది.
5/6
ఈ శాంసంగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.
6/6
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. 4000mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.