Upcoming Independence Sale : ఆగస్టులో అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రోపై బిగ్ డీల్స్.. ఏ ఫోన్ కొంటే బెటర్..?

Upcoming Independence Sale : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రో వంటి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండొచ్చు.

Upcoming Independence Sale : ఆగస్టులో అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రోపై బిగ్ డీల్స్.. ఏ ఫోన్ కొంటే బెటర్..?

Upcoming Independence Sale

Updated On : July 28, 2025 / 1:00 PM IST

Upcoming Independence Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ ఇండిపెండెన్స్ (Amazon Freedom Sale) సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆసక్తిగల వినియోగదారులు (Upcoming Independence Sale) ఈ సేల్ సమయంలో భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. కొనుగోలు చేసే ప్రొడక్టులపై బెస్ట్ డీల్స్ పొందవచ్చు.

అయితే, ఈ స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఫోన్లపై కూడా మరిన్ని డీల్స్ పొందవచ్చు. మీరు ఐఫోన్ 16 ప్రో కొనాలన్నా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ఆఫర్లను ఎంచుకోవచ్చు. అయితే, ఈ రెండు ఫోన్లు అమెజాన్ ప్రీడమ్ సేల్ సమయంలో అందుబాటులో ఉంటాయి. కెమెరా, స్పెసిఫికేషన్ల పరంగా ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెస్ట్? ఎందులో ఎక్కువగా ఫీచర్లు, ఇతర బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా Vs ఐఫోన్ 16 ప్రో కెమెరా, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 10MP టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో అద్భుతమైన షాట్స్ వస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్‌ను కూడా కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో విషయానికొస్తే.. 48MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP సెన్సార్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

Read Also : Flipkart Freedom Sale : ఆగస్టులో ఫ్లిప్‌కార్ట్ మరో బిగ్ సేల్.. స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై అదిరే డీల్స్.. గెట్ రెడీ..!

బేస్ మోడల్‌లో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ బేస్ వేరియంట్‌లో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 25W మ్యాగ్‌సేఫ్ 15W Qi2 ఛార్జింగ్‌కు సపోర్టుతో 3582mAh బ్యాటరీని కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. ఏది కొనాలంటే? :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రో ఫోన్లు రెండూ అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకు.. మీరు పవర్‌ఫుల్ ప్రాసెసర్, కెమెరా వంటి ఫీచర్లతో ప్రీమియం ఆపిల్ ఐఫోన్ కావాలంటే ఐఫోన్ 16 ప్రో మీకు బెస్ట్ ఆప్షన్.

అయితే, ఆండ్రాయిడ్ OSతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రీమియం లెవ్ గెలాక్సీ AI ఫీచర్లు కావాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ తీసుకోవచ్చు. మొత్తం మీద మీరు కొనే ఫోన్ ఆప్షన్ పూర్తిగా మీ బడ్జెట్‌పైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.