Samsung Galaxy S25
Samsung Galaxy S25 : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్ అవుతున్నాయి. ఇంతలోనే శాంసంగ్ గెలాక్సీ S25 ధర భారీగా తగ్గింపు పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 80,999 ధరకు లాంచ్ అయిన ఈ శాంసంగ్ S25 చౌకైన ధరకే లభిస్తోంది.
అందులోనూ శాంసంగ్ అత్యంత (Samsung Galaxy S25) కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, అమోల్డ్ డిస్‌ప్లే, ప్రీమియం ఎండ్ అందిస్తుంది. ఇప్పుడు, అమెజాన్‌లో రూ. 20వేల కన్నా ఎక్కువ ధర తగ్గింపును అందిస్తోంది. 2025లో బెస్ట్ వాల్యూ ఫ్లాగ్‌షిప్ డీల్‌లలో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ ఒకటిగా నిలిచింది. ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర తగ్గింపు :
అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ.63,690కి తగ్గింది. ఇప్పటికే అసలు లాంచ్ ధర నుంచి నేరుగా రూ.17,309 తగ్గింపు పొందింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా అదనంగా రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా అసలు ధర నుంచి రూ. 60,690 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేకుండానే మొత్తం సేవింగ్ రూ.20,309 అవుతుంది. మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ ట్రేడింగ్ చేస్తుంటే.. డివైస్ మోడల్, కండిషన్ ఆధారంగా అమెజాన్ రూ.44,050 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. హై-ఎండ్ లేదా కొత్త ఫోన్ల కొనుగోలుపై టాప్ వాల్యూ భారీగా తగ్గిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. హుడ్ కింద, హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ8పై రన్ అవుతుంది. లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.
బ్యాటరీ లైఫ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4000mAh యూనిట్ నుంచి వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 ట్రిపుల్-కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా, ఐసీ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ షాడో, పింక్ గోల్డ్, కోరల్ రెడ్ బ్లూ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి.