Samsung Galaxy S25 Ultra Price
Samsung Galaxy S25 Ultra Price : శాంసంగ్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం. శాంసంగ్ ఇటీవలే లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై లిమిటెడ్ ఆఫర్ ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మోడల్ భారీ తగ్గింపుతో అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. టైటానియం సిల్వర్‌బ్లూ గెలాక్సీ S25 అల్ట్రాను రూ.12వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు నెలకు రూ.3,278 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గుదల :
ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా కొనుగోలుదారులు గెలాక్సీ S25 అల్ట్రాను పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 1,17,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభంలో 12GB + 256GB వేరియంట్ ధర రూ. 1,29,999గా ఉండేది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ టైటానియం సిల్వర్ బ్లూ వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా సేల్ :
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో గెలాక్సీ S25 అల్ట్రా డిస్కౌంట్‌తో లభిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు రూ.11వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.1,18,999కి తగ్గుతుంది.
ఈ ఆఫర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. అదనంగా, రెండు ప్లాట్‌ఫామ్‌లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు పాత స్మార్ట్‌ఫోన్‌లపై ట్రేడింగ్ ద్వారా మరింత ఆకర్షణీయమై డీల్స్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కలర్ ఆప్షన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం బ్లాక్, టైటానియం వైట్‌సిల్వర్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ టైటానియం పింక్‌గోల్డ్, టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం జాడెగ్రీన్ వంటి ప్రత్యేక కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G టైటానియం ఫ్రేమ్‌తో వస్తుంది. ప్రీమియం లుక్ ఉంటుంది. 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. 2,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. అడాప్టివ్ 1-120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ మాత్రమే కాదు.. గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ ఫోన్ గెలాక్సీ చిప్‌సెట్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్, ఏఐ ఆధారిత టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
Read Also : Nothing Phone 3 : నథింగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఏఐ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోందోచ్.. ఇదిగో ప్రూఫ్..!
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా శాంసంగ్ వన్ UI 7పై రన్ అవుతుంది. 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ సెన్సార్, 10MP 3x టెలిఫోటో లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.