Samsung Galaxy Z Flip 6 5G : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఈ శాంసంగ్ 5G ఫోన్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy Z Flip 6 5G : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.. డోంట్ మిస్..

Samsung Galaxy Z Flip 6 5G
Samsung Galaxy Z Flip 6 5G : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. లేటెస్ట్ జనరేషన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ (Samsung Galaxy Z Flip 6 5G) డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. అన్ని డిస్కౌంట్‌లతో దాదాపు రూ.69వేల ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ రూ. 1,09,999 ధరకు లాంచ్ అయింది. డ్యూయల్ అమోల్డ్ స్క్రీన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఫ్లిప్‌తో పాటు మంచి కెమెరా ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 5G ధర :
ఈ మడతబెట్టే ఫోన్ రూ.72,999కు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ధర దాదాపు రూ.69వేల వరకు తగ్గుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
Read Also : Children Aadhaar Card : మీ పిల్లల ఆధార్ కార్డ్‌లో ఈ అప్‌డేట్ చేయకపోతే డియాక్టివేట్.. UIDAI వార్నింగ్..!
వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉంటే నో-కాస్ట్ ఈఎంఐతో ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లించడం ద్వారా మొబైల్ ప్రొటెక్షన్ లేదా ఎక్స్‌టెండెడ్ వారంటీ యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ ప్యానెల్, 3.4-అంగుళాల అమోల్డ్ కవర్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 10MP కెమెరా కలిగి ఉంది.