×
Ad

Samsung Galaxy Z Fold 7 : అమెజాన్ దీపావళి సేల్.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7పై బిగ్ డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ పొందాలంటే?

Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ ఫోన్ అదిరిపోయే ఆఫర్.. దీపావళి సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.

Samsung Galaxy Z Fold 7

Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దీపావళి సేల్ సందర్భంగా శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్లిమ్ డిజైన్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది.

అమెజాన్‌లో ఈ మడతబెట్టే ఫోన్ అదిరిపోయే (Samsung Galaxy Z Fold 7) డిస్కౌంట్‌తో లభిస్తోంది. మీరు శాంసంగ్ అభిమానులు అయితే.. ఈ ప్లాట్‌ఫామ్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఏకంగా రూ. 13వేలు తగ్గింపు పొందింది. అమెజాన్‌లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే..?

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 అమెజాన్ దీపావళి డీల్ :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 మడతబెట్టే ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్లో రూ.1,74,999కు అందుబాటులో ఉంది. ఇప్పుడు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లందరూ ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకుండా స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తిగల యూజర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1250 తగ్గింపు కూడా పొందవచ్చు. బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్ బ్లాక్‌తో సహా 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Dhanteras Sale : ధన్‌తేరాస్ సేల్.. షావోమీ, శాంసంగ్ 43 అంగుళాల స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు.. సగం ధరకే కొనేసుకోండి..!

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 మడతబెట్టే ఫోన్ 8-అంగుళాల ఎల్టీపీఓ డైనమిక్ అమోల్డ్ 2X ఇన్నర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఔటర్ డిస్‌ప్లే అందిస్తుంది. హై-ఆక్టేన్ పర్ఫార్మెన్స్ కోసం అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా, ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ ఏడు మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 10MP కవర్, 10MP సెల్ఫీ స్నాపర్‌ కలిగి ఉంది. 4400mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.