SBI Mutual Fund : మీరే కాదు.. మీ పిల్లల పాకెట్ మనీతో SIPలో ఇన్వెస్ట్ చేయొచ్చు.. కేవలం రూ. 250తో 20ఏళ్లలో ఎంత డబ్బు చేతికి వస్తుందంటే?

SBI Mutual Fund : ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మీరే కాదు.. మీ పిల్లల పాకెట్ మనీతో కూడా SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. కేవలం నెలకు రూ.250 చొప్పున 20 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో తెలుసా?

SBI Mutual Fund Launches

SBI Mutual Fund : ప్రస్తుత రోజుల్లో పెట్టుబడులపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు అధిగమించేందుకు ముందుగానే ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. సాధారణంగా పెద్దవాళ్లే ఎక్కువగా ఈ పెట్టుబడి పెడుతుంటారు. అయితే, పిల్లలు కూడా తాము దాచుకున్న పాకెట్ మనీతో పెట్టుబడి పెట్టవచ్చు తెలుసా? మీరు చేయాల్సిందిల్లా ఎస్ఐపీ (SIP)లో పెట్టుబడి పెట్టడమే.. మీరే కాదు.. మీ పిల్లలతో కూడా ఇందులో పెట్టుబడిని పెట్టేలా ప్రోత్సహించవచ్చు.

Read Also : New Smartphones 2025 : మార్చిలో రిలీజ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఈ లిస్టులో మూడో ఫోన్ వండర్‌ఫుల్.. గేమింగ్, సెల్ఫీ ప్రియులు డోంట్ మిస్..

ప్రస్తుతం SIPలో పెట్టుబడి చాలా వేగంగా పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి SIP ద్వారా జరుగుతుంది. సాధారణంగా, ఎస్ఐపీలో పెట్టుబడి కనీసం రూ. 500 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. కానీ, కొంతకాలం క్రితం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో కలిసి జన్ నివేష్ (JanNivesh SIP) స్కీమ్ ప్రారంభించింది.

ఇందులో మీరు కేవలం రూ. 250 నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. చాలా చిన్న మొత్తంలో పిల్లలు కూడా తమ పాకెట్ మనీ నుంచి ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. అసలు ఈ ఎస్ఐపీ స్కీమ్ ఎలా ఉంటుంది? ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? ప్రతి నెలా రూ. 250 పెట్టుబడి పెడితే 20ఏళ్లలో ఎంత రాబడి చేతికి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎస్బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుబడి :
జాన్ నివేష్ ఇన్వెస్ట్ ఎస్ఐపీ ద్వారా పెట్టుబడిదారుల డబ్బు ఎస్బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుబడిగా పెడతారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హైబ్రిడ్ స్కీమ్‌గా చెప్పవచ్చు.

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుబడితో ప్రయోజనాలేంటి?
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల డబ్బు ఈక్విటీ, డెట్‌లో డైనమిక్‌గా పెట్టుబడి పెడతారు. దేనిపై ఏ సమయంలో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం పూర్తిగా ఫండ్ మేనేజర్ అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్లు మార్కెట్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ఈ కారణంగా మంచి రాబడిని ఇచ్చే పథకంగా చెప్పవచ్చు.

మీరు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చుంటే? :
మీరు కూడా (JanNivesh SIP) స్కీమ్ కింద పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మీరు ఎస్బీఐ YONO యాప్ ద్వారా సులభంగా చేయవచ్చు. అంతేకాకుండా, మీరు Paytm, Zerodha, Groww వంటి డిజిటల్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

రోజువారీ లేదా వారం, నెలవారీ ఎస్ఐపీ :
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జన్ నివేష్ స్కీమ్ (JanNivesh) ప్రకారం.. మీరు రోజువారీ, వారం, నెలవారీ SIP ఆప్షన్ పొందుతారు. మీ సౌలభ్యాన్ని బట్టి మీరు ఇందులో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.

5 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే? :
ఈ స్కీమ్‌లో మీరు ప్రతి నెలా రూ. 250 చొప్పున 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ. 15వేలు అవుతుంది. 12శాతం సగటు రాబడి రేటుతో మీరు 5 ఏళ్లలో రూ. 5,276 రాబడిని పొందుతారు. ఈ విధంగా మీకు 5 ఏళ్లలో మొత్తంగా రూ. 20,276 రాబడి చేతికి వస్తుంది.

Read Also : iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోంది.. అత్యంత సన్నని ఐఫోన్ ఇదే.. ఫీచర్లు హైలైట్ అంట..!

10 ఏళ్లు లేదా 20 ఏళ్లలో రాబడి ఎంతంటే? :
మీరు నెలకు రూ.250 చొప్పున 10 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయడం ద్వారా రూ.30వేలు పెట్టుబడి పెట్టవచ్చు. 12 శాతం రేటుతో రూ. 26,009 రాబడిని పొందుతారు. రూ. 56,009 వడ్డీ వస్తుంది. మీరు అలానే 20 ఏళ్లు కొనసాగిస్తే.. మొత్తం పెట్టుబడి రూ. 60వేలు అవుతుంది. 12శాతం రేటుతో రాబడి రూ. 1,69,964 అవుతుంది. 20 ఏళ్లలో మొత్తం రూ. 2,29,964 డబ్బు మీ చేతికి అందుతుంది.

అందరూ గుర్తుంచుకోండి :
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి ఎప్పుడూ మార్కెట్ లింక్ అయి ఉంటాయి. మీ రాబడిపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. అదే SIPలో పెట్టుబడి పెడితే సగటు రాబడి 12 శాతంగా ఉంటుంది. ఇక్కడ 12 శాతం రాబడి ఆధారంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ఎక్కువ లేదా తక్కువ కావచ్చు.