India Ranks Fourth Globally In Savings
India Savings Rank : భారత్‌లో పొదుపు సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచో వస్తోంది. విశేషమేమిటంటే.. నేటికీ దేశ పొదుపు రేటు ప్రపంచ సగటు కన్నా ఎక్కువగానే ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం.. భారత పొదుపు రేటు 30.2 శాతం, ప్రపంచ సగటు 28.2 శాతం కన్నా ఎక్కువే. అయితే, డబ్బు పొదుపులో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. భారత్ కన్నా ముందు పొరుగుదేశమైన చైనా (46.6శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాత ఇండోనేషియా (38.1శాతం), రష్యా (31.7శాతం) ఉన్నాయి. ఎస్బీఐ నివేదిక హౌస్ సేవింగ్స్ విషయంలో మారుతున్న పరిస్థితులను హైలైట్ చేస్తుంది. పెరుగుతున్న ఆర్థిక చేరిక స్థాయిలతో 80 శాతం కన్నా ఎక్కువ మంది ఇప్పుడు అధికారిక ఫైనాన్షియల్ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. 2011లో ఈ సంఖ్య 50 శాతం మాత్రమే ఉంది.
నివేదిక ప్రకారం.. బ్యాంక్ డిపాజిట్లు, క్యాష్ వంటి సాంప్రదాయ సేవింగ్స్ ఆప్షన్ల వాటా ఇప్పుడు భారత్‌లో క్రమంగా తగ్గుతోంది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల వంటి కొత్త ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్ హౌస్ సేవింగ్స్ కోసం ప్రాధాన్యత ఎంపికగా మారుతున్నాయి.
2018 ఆర్థిక సంవత్సరం నుంచి మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రిజిస్ట్రేషన్లు 4 రెట్లు పెరిగి 4.8 కోట్లకు చేరుకున్నాయి. భారతీయులు ఇప్పుడు ‘షేర్లు, డిబెంచర్ల’లో కూడా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. పదేళ్ల క్రితం అంటే.. 2014 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో షేర్లు, డిబెంచర్ల వాటా 0.2 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2024లో ఒక శాతానికి పెరిగింది.
గత కొన్ని సంవత్సరాల్లో నికర ఆర్థిక పొదుపు వాటా పెరిగింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 36 శాతం కాగా, 2021 ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి చేరుకుంది. అయితే, ఆర్థిక సంవత్సరం 2022, ఆర్థిక సంవత్సరం 2023లో స్వల్ప క్షీణత కనిపించింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంసీపీ)లో ఒక శాతం పెరుగుదల జీడీపీ వృద్ధి రేటును 0.6 శాతం పెంచుతుందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. గత 10 ఏళ్లలో భారతీయ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ నుంచి సేకరించిన డబ్బు మొత్తం 10 రెట్లు పెరిగింది. 2014 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.12,068 కోట్లు కాగా, అక్టోబర్ 2025 నాటికి రూ.1.21 లక్షల కోట్లకు పెరిగింది.
Read Also : OnePlus 13 Series : వచ్చే వారమే వన్‌ప్లస్ 13 సిరీస్ వచ్చేస్తోంది.. డిజైన్, ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే!