×
Ad

SBI YONO Aadhaar : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? అది ఫేక్ APK స్కామ్.. ఎలా సేఫ్‌గా ఉండాలంటే?

SBI YONO Aadhaar : ఎస్బీఐ కస్టమర్లకు ఆధార్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలంటూ ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ నిజమేనా? కేంద్రం ఏం చెప్పిందంటే?

SBI YONO Aadhaar Card (Image Credit To Original Source)

  • ఆధార్ అప్‌డేట్‌ లింకింగ్ ఫేక్ APKలను డౌన్‌లోడ్ చేసుకోవద్దు
  • SBI కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
  • SBI YONO యాప్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ అవాస్తవం
  • గుర్తుతెలియని లేదా షార్ట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దు

SBI YONO Aadhaar : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీకు ఏమైనా ఆధార్ అప్ డేట్ కోసం మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త.. అది స్కామర్ల పనే.. మీ అకౌంట్ ఏ క్షణమైన హ్యాక్ అవుతుంది జాగ్రత్త.. ఇలాంటి మెసేజ్ లకు అసలు స్పందించొద్దు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మెసేజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.

కస్టమర్లు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయకపోతే ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందని ఆ మెసేజ్ హెచ్చరిస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తోంది. అయితే, ఇదంతా స్కామర్ల ట్రాప్ అని కస్టమర్లు తొందరపడి వివరాలు షేర్ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వైరల్ మెసేజ్‌లో ఏముంది? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఒక మెసేజ్ వచ్చినట్టుగా అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది. ఎస్బీఐ యూజర్లు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని అందులో పేర్కొంది. ఆధార్‌ అప్‌డేట్ చేయకపోతే, SBI YONO యాప్ బ్లాక్ అవుతుందని కూడా మెసేజ్‌లో పేర్కొంది.

ఆ మెసేజ్ పూర్తిగా తప్పు :
ఈ వైరల్ మెసేజ్‌లోని వివరాలు పూర్తిగా తప్పు. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే మీ ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ వాస్తవం కాదు. ఎస్బీఐ బ్యాంక్ ఇలాంటి ఆర్డర్ లేదా నోటీసు జారీ చేయలేదని తేలింది.

సైబర్ మోసగాళ్లు బ్యాంకు వినియోగదారులను మోసగించేందుకు APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతూ మెసేజ్ పంపుతున్నారు. ఇలాంటి మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎస్బీఐ యూజర్లు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలనే మెసేజ్ పూర్తిగా తప్పుగా గమనించాలి.

APK ఫైల్‌ డౌన్‌లోడ్ చేయొద్దు :
భారత ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్-చెకింగ్ బృందం కూడా ఈ వైరల్ సందేశంలోని వాదనను తోసిపుచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి APKలను డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించింది. వ్యక్తిగత, బ్యాంకింగ్ లేదా ఆధార్ వివరాలను అసలు ఎవరితోనూ షేర్ చేయొద్దని సూచించింది.

SBI YONO Aadhaar Card

ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :

· మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా ద్వారా పంపిన APK ఫైల్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయొద్దు
· గుర్తుతెలియని లేదా షార్ట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దు
· బ్యాంకింగ్, OTP లేదా ఆధార్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దు
· అధికారిక బ్యాంకు లేదా ప్రభుత్వ మార్గాల ద్వారా క్లెయిమ్‌లను వెరిఫై చేయండి.

ఎస్బీఐ కస్టమర్లు తప్పక గుర్తుంచుకోవాలి :
· గుర్తుతెలియని యాప్‌లు లేదా లింక్‌ల ద్వారా ఆధార్ లింకింగ్ లేదా అప్‌డేట్‌లు ఎప్పుడూ జరగవు.
· ఎస్బీఐ యోనో అప్‌డేట్‌లు అధికారిక యాప్ స్టోర్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
· మెసేజ్ లేదా కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే అది స్కామ్ అని గుర్తించాలి

బ్యాంకు వ్యక్తగత సమాచారం అడగదు :
ఎస్బీఐ బ్యాంక్ ఎప్పుడూ కూడా వ్యక్తిగత సమాచారం అడగదు. బ్యాంకు పేరుతో ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే (report.phishing@sbi.co.in)కు రిపోర్టు చేయండి. ఇలాంటి మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు.