Maruti Suzuki Fronx : జస్ట్ రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంటికి తెచ్చుకోండి.. నెలకు ఎంత EMI కట్టాలంటే?

Maruti Suzuki Fronx : మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు కొనుగోలు చేయొచ్చు. ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలంటే?

Maruti Suzuki Fronx : జస్ట్ రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంటికి తెచ్చుకోండి.. నెలకు ఎంత EMI కట్టాలంటే?

Maruti Suzuki Fronx (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 7:03 PM IST
  • మారుతి సుజుకి కార్లలో అత్యంత సరసమైన ఫ్రాంక్స్
  • ఫ్రాంక్స్ బేస్ వేరియంట్ రూ. 6.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌, నెలకు ఈఎంఐ రూ. 17,999

Maruti Suzuki Fronx : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. భారతీయ కస్టమర్ల కోసం మారుతి సుజుకి అదిరిపోయే డీల్ అందిస్తోంది. మారుతి సుజుకి కార్లలో మోస్ట్ పాపులర్ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒకటి. ప్రస్తుతం ఈ కారు మోడల్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. మీరు జస్ట్ రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌ కడితే చాలు.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు వివరాలను తెలుసుకుందాం..

Maruti Suzuki Fronx

Maruti Suzuki Fronx (Image Credit To Original Source)

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర ఎంతంటే? :
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర విషయానికి వస్తే.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రారంభ ధర బేస్ వేరియంట్ రూ. 6.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం సుమారు రూ. 52వేలు చెల్లించాలి. అలాగే ఇన్సూరెన్స్ కోసం రూ. 28వేలు చెల్లించాలి. ఇతర ఛార్జీలతో సహా కారు ధర మీకు రూ. 7.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు వస్తుంది.

Read Also : OnePlus Nord CE 5 : వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్.. 7100mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ CE5 5G ఫోన్, జస్ట్ రూ.22,999కే..!

నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొనుగోలు చేస్తే.. రూ. 5.66 లక్షలను బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి. ఈ లోన్ 9 శాతం వడ్డీ రేటుతో 3 ఏళ్లకు బ్యాంకు నుంచి తీసుకుంటే నెలకు రూ. 17,999 ఈఎంఐ చెల్లించాలి. అంటే.. మూడేళ్లలో మొత్తం రూ. 6.47 లక్షలు తిరిగి చెల్లించాలి. ఇందులో, రూ. 81వేలు వడ్డీగా మాత్రమే చెల్లిస్తారు.