Union Budget 2026 : సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ దక్కేనా? ఈసారి బడ్జెట్‌లో భారీగా మినహాయింపులు ఉంటాయా? ఫుల్ డిటెయిల్స్..!
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 ప్రధాన మార్పుల కన్నా కొత్త పన్ను విధానాన్ని మెరుగుపరచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ సిటిజన్లు మినహాయింపులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Union Budget 2026 (Image Credit To Original Source)
- ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రకటన
- సీనియర్ సిటిజన్లకు అదనపు మినహాయింపులు ఉండొచ్చు
- వడ్డీ ఆదాయంపై టీడీఎస్ తగ్గింపు పరిమితి పెంచే ఛాన్స్
Union Budget 2026 : ఈసారి బడ్జెట్ 2026 పైనే అందరి ఆశలు.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మినహాయింపులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రాబోయే బడ్జెట్ కూడా సాధారణ పౌరుల దగ్గర నుంచి సీనయర్ సిటిజన్ల వరకు అందరికి మినహాయింపులు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ రిలీఫ్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మినహాయింపులను పెంచడం, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఉపశమనం అందించడంపై పరిశీలిస్దుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. ఆరోగ్యపరంగా వారి సంరక్షణ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే సీనియర్ సిటిజన్లకు అదనపు మినహాయింపులు ఉండొచ్చునని అంటున్నారు.
ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రకటన :
2026-27 ఆర్థిక ఏడాదికి కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకు డిపాజిట్లు, చిన్న సేవింగ్స్ స్కీమ్స్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై మినహాయింపులను పెంచాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. వడ్డీ ఆదాయంపై అధిక మినహాయింపు అందించడం ద్వారా సీనియర్ సిటిజన్లు ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలను ఈజీగా ఎదుర్కోవచ్చు.
ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం.. 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి ఏదైనా బ్యాంకు, సహకార సంఘం, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ల నుంచి ఏడాదికి రూ. 10వేల వరకు వడ్డీ ఆదాయం వస్తుంటే ఆదాయపు పన్ను మినహాయింపుకు అర్హులు. అయితే, ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు లేదా కార్పొరేట్ బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి మినహాయింపు ఉండదు.

Union Budget 2026 (Image Credit To Original Source)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTB ప్రకారం.. 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ అకైంట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, టైమ్ డిపాజిట్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు లేదా సహకార బ్యాంకులో ఏదైనా ఇతర డిపాజిట్ నుంచి ఆర్థిక సంవత్సరంలో రూ. 50వేల వరకు సంపాదించిన వడ్డీపై మినహాయింపు పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ తగ్గింపు పరిమితి పెంచే అవకాశం కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక ఏడాది నుంచి బ్యాంకులు వార్షిక ఆదాయం రూ. లక్ష దాటితేనే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై టీడీఎస్ తగ్గిస్తాయి. గతంలో రూ.50వేలు పరిమితి ఉండేది. వడ్డీ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే రిటైర్డ్ వ్యక్తులకు ఈ పరిమితిని పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కొత్త పన్ను విధానాన్ని మెరుగుపర్చే అవకాశం :
నివేదికల ప్రకారం.. 2026 బడ్జెట్‌లో ప్రధాన మార్పులను ప్రకటించడం కన్నా కొత్త పన్ను విధానాన్ని మెరుగుపరచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్లకు సంబంధించి కూడా మార్పు ఉండవచ్చు. యజమాని ఆధారిత ప్రావిడెంట్ ఫండ్ మినహాయింపును కొత్త పన్ను విధానంలోకి తీసుకువచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.
స్టాండర్డ్ డిడెక్షన్ పరిమితి పెంచే ఛాన్స్ :
నివేదిలక ప్రకారం.. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడెక్షన్ పరిమితి కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది. రూ.25వేలు లేదా అంతకంటే ఎక్కువ పెంచవచ్చు. పన్ను రేట్ల విషయంలో మాత్రం మార్పులు ఉండకపోవచ్చు. కొత్త పన్ను విధానం కింద స్లాబ్ రేట్లు మారే అవకాశం లేదు.
అయితే, ప్రభుత్వం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించే ప్రయత్నంలో సర్‌ఛార్జ్‌లలో కొన్ని మార్పులు చేయొచ్చు. మొత్తంమీద, బడ్జెట్ 2026 వ్యక్తిగత ఆదాయ పన్నులో ప్రధాన సంస్కరణల కన్నా ఉపశమనం కలిగించడంపైనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు.
