Samsung Galaxy A55 5G : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A55 5G : శాంసంగ్ 5జీ ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ శాంసంగ్ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అయితే, ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A 55 5G ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ కేటగిరీల ప్రొడక్టులపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్..

ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ ఎ సిరీస్ ఫోన్ సరసమైన ధరకే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లలో లభిస్తోంది. ఇంతకీ ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A55 5G అమెజాన్ డీల్ : శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) భారత మార్కెట్లో రూ.39,999 ధరకు లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఈ మోడల్ కేవలం రూ.23,998కే అందుబాటులో ఉంది. అంటే.. రూ.16,001 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది.

ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.
