దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 25, 2019) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ సూచీలు బలపడిన వేళ దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటిగా 1.15శాతం మేర ఎగసాయి. మధ్యాహ్న సెషన్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 40వేల 868 మరో లైఫ్ టైమ్ రికార్డును తాకింది.
మరోవైపు NSE నిఫ్టి మాత్రం 12,067 వద్ద ట్రేడ్ అయింది. ఈ రెండూ కలిసి 36 పాయింట్లుగా ఆల్ టైమ్ రికార్డు 12, 103 చేరువలో నిలిచాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య పరిణామాలతో ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణితో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు ఆరంభంలోనే లాభాల బాట పట్టాయి.
అదే దూకుడుతో ముందుకు సాగుతూ కొత్త గరిష్టాల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 5వందల పాయింట్లకు పైగా ఎగిసింది. అప్పటినుంచి పుంజుకున్న సెన్సెక్స్ మధ్యాహ్నానికి 40వేల 868 వద్ద, నిఫ్టీ 12067 వద్ద కొనసాగుతున్నాయి.
తద్వారా సెన్సెక్స్ ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక నెఫ్టీ మాత్రం చారిత్రక మార్కుకు చేరువలో నిలిచింది. అన్ని రంగాలు లాభాల పట్టాయి. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 2.85శాతానికి లాభపడింది. ఫార్మా రంగంతో పాటు రియాల్టీ, ఆటో రంగాల్లో 1.50శాతం మేర లాభాలను సాధించాయి.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో అదనంగా 1.2శాతానికి మెరుగుపడ్డాయి. ఒక మీడియా రంగం మాత్రమే రెడ్ మార్క్ ట్రేడ్ అవుతోంది. ఇతర అన్ని రంగాల్లోని సూచికలు మాత్రం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి. ఇక, ఇండస్ ఇండ్, వేదాంతా, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌ఎసీ, సన్‌ఫార‍్మా, హీరో మోటో, యాక్సిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.