September Bank Holidays : సెప్టెంబర్‌లో మీకు బ్యాంకులో పని ఉందా? 15 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో సెలవులంటే? ఫుల్ లిస్ట్

September Bank Holidays : బ్యాంకులకు వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. వచ్చే సెప్టెంబర్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.

September Bank Holidays 2025

September Bank Holidays 2025 : మీకు సెప్టెంబర్ నెలలో బ్యాంకులో పని ఉందా? అయితే, ఇది మీకోసమే.. వచ్చే సెప్టెంబర్‌లో బ్యాంకులకు మొత్తం 15 రోజులు (September Bank Holidays 2025) సెలవులు ఉన్నాయి. మీకు బ్యాంకులో ఏదైనా పనిమీద వెళ్లాలని చూస్తుంటే సెప్టెంబర్‌లో చాలావరకూ బ్యాంకులు పనిచేయవు. ఎందుకంటే.. సెప్టెంబర్‌లో వివిధ పండుగలు, రెండో, నాల్గో శనివారాలు, ఆదివారాలు కారణంగా బ్యాంకులు 15 రోజులు మూతపడతాయి.

అయితే, అన్ని సెలవులు ప్రతి రాష్ట్రంలోనూ వర్తించవని గమనించాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పండగులు ప్రాంతీయంగా ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండగలు, ఇతర అంశాలపై ఆధారపడి బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Samsung Galaxy A55 5G : ఈ కొత్త శాంసంగ్ 5G ఫోన్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలిస్తే ఎగబడి కొనేస్తారంతే!

సెప్టెంబర్‌లో 15 రోజులు బ్యాంకులకు సెలవులు :

3 సెప్టెంబర్ 2025 (బుధవారం) : కర్మ పూజ రోజున జార్ఖండ్, రాంచీలో బ్యాంకులకు సెలవులు
4 సెప్టెంబర్ 2025 (గురువారం) : కేరళలోని మొదటి ఓనం, తిరువనంతపురం, కొచ్చిలో సెలవులు
5 సెప్టెంబర్ 2025 (శుక్రవారం) : ఈద్-ఎ-మిలాద్ / మిలాద్-ఉన్-నబి అనేక రాష్ట్రాలు
6 సెప్టెంబర్ 2025 (శనివారం) : ఈద్-ఎ-మిలాద్ గాంగ్టక్, రాయ్‌పూర్
7 సెప్టెంబర్ 2025 (ఆదివారం) : వీక్లీ హాలిడే (ఆల్ ఇండియా)
12 సెప్టెంబర్ 2025 (శుక్రవారం) ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో సెలవులు
13 సెప్టెంబర్ 2025 (శనివారం) రెండో శనివారం దేశమంతటా సెలవు
14 సెప్టెంబర్ 2025 (ఆదివారం) వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)
21 సెప్టెంబర్ 2025 (ఆదివారం) వీకెండ్ హాలిడే సెలవు (ఆల్ ఇండియా)
22 సెప్టెంబర్ 2025 (సోమవారం) నవరాత్రి రోజున జైపూర్‌లో బ్యాంకులకు సెలవులు
23 సెప్టెంబర్ 2025 (మంగళవారం) మహారాజా హరి సింగ్ జయంతి జమ్మూ, శ్రీనగర్‌లో సెలవులు
27 సెప్టెంబర్ 2025 (శనివారం) నాల్గో శనివారం (ఆల్ ఇండియా)
28 సెప్టెంబర్ 2025 ఆదివారం వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)
29 సెప్టెంబర్ 2025 (సోమవారం) మహా సప్తమి/దుర్గా పూజ అగర్తల, గౌహతి, కోల్‌కతా
30 సెప్టెంబర్ 2025 (మంగళవారం) మహా అష్టమి/దుర్గా పూజ అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో హాలీడే

Note : ఈ సెలవుల జాబితా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెలవుల షెడ్యూల్ ఆధారంగా రూపొందించారు. అయితే, వివిధ రాష్ట్రాలలోని స్థానిక సెలవులను బట్టి మారవచ్చు. బ్యాంకులకు వెళ్లే ముందు మీ రాష్ట్రంలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ఓసారి చెక్ చేసుకుని వెళ్లడం బెటర్.

Read Also : Happy Ganesh Chaturthi 2025 : హ్యాపీ గణేష్ చతుర్థి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో కావాలా? ఇలా డౌన్‌లోడ్ చేసి షేర్ చేసుకోండి..!

బ్యాంకింగ్ సేవలపై ప్రభావం :
ఈ వరుస సెలవుల కారణంగా కస్టమర్లకు నేరుగా బ్యాంకు శాఖలలో సేవలను పొందలేరు. ఈ సెలవుల్లో క్యాష్ డిపాజిట్లు, పాస్‌బుక్ అప్‌డేట్ లేదా వ్యక్తిగత లావాదేవీలు వంటి సేవలు అందుబాటులో ఉండవు.

యూపీఐ లావాదేవీలు చేయొచ్చు :
యూపీఐ లావాదేవీల కోసం వినియోగదారులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సర్వీసులను వినియోగించుకోవచ్చు. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లాలనుకునే వారు ముందుగానే ఏయే ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.