Electric Two Wheeler Sales : ఎలక్ట్రిక్ స్కూటర్ల దూకుడు.. సెప్టెంబరులో టీవీఎస్‌దే ఆధిపత్యం!

Electric Two Wheeler Sales : సెప్టెంబరులో భారత ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల అమ్మకాలు 7.7 శాతం పెరిగాయి. టీవీఎస్‌ మోటార్‌ 26.3 శాతం వాటాతో ముందంజలో ఉండగా, ఓలా ఎలక్ట్రిక్‌ వాటా 6.5 శాతానికి తగ్గింది.

Electric Two Wheeler Sales

  • గత నెలలో సుమారు 1.97 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్
  • సెప్టెంబర్‌లో టీవీఎస్ మోటార్ మార్కెట్ వాటా 26.3 శాతం
  • బజాజ్ ఆటో సుమారు 23.5 శాతం వాటాతో రెండో స్థానంలో..

Electric Two Wheeler Sales : భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల మార్కెట్‌ సెప్టెంబరులో మరోసారి భారీ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో సుమారు 1.97 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు విక్రయమయ్యాయి.

ఆగస్టుతో పోలిస్తే అమ్మకాలు దాదాపు 7.7 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు మొత్తం అమ్మకాలు సుమారు 15.61 లక్షల వాహనాలకు చేరుకున్నాయి. కొత్త ఎడిషన్ విడుదల, పెట్రోల్‌ ధరల పెంపు వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్‌ పెంచేలా చేశాయి.

టీవీఎస్‌ మోటార్‌కు అగ్రస్థానం :
గణాంకాల ప్రకారం.. సెప్టెంబరులో టీవీఎస్‌ మోటార్‌ 26.3 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్‌ ఆటో 23.5 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, ఏథర్‌ ఎనర్జీ 14.7 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.

Read Also : HMD Vibe 2 5G : వారెవ్వా.. కొత్త HMD వైబ్ 2 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర రూ.11 వేల లోపే!

హీరో మోటోకార్ప్‌ 11.7 శాతం వాటాతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు, గతంలో ఇదే సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్‌ వంటి ట్రెడిషనల్ టూవీలర్ వాహన తయారీ సంస్థలు విద్యుత్‌ వాహన విభాగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. వైడ్ సేల్, సర్వీసు సెంటర్ల వ్యవస్థతో పాటు భారీ ప్రొడక్టు సామర్థ్యంతో ఓలా ఎలక్ట్రిక్‌ వాటా సెప్టెంబరులో 6.5 శాతానికి తగ్గింది.

బిగ్ కంపెనీల వైపే మొగ్గు :
టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌ వంటి ట్రెడిషనల్ టూవీలర్ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. వైడ్ సేల్, సర్వీసు సెంటర్ల సిస్టమ్, భారీ ఉత్పత్తి సామర్థ్యం అనుకూలంగా మారుతోంది.

ఐక్యూబ్‌ స్పెషల్ ఎడిషన్‌ లాంచ్ :
ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా టీవీఎస్‌ మోటార్‌ ప్రత్యేక ఎడిషన్ లాంచ్ చేసింది. ఇందులో 3.5 కిలోవాట్‌ గంటల సామర్థ్యంతో బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్ ధర రూ.1,40,138గా నిర్ణయించారు.

నార్తర్న్ లైట్స్ గ్రీన్ డ్యూయల్-టోన్ రంగుతో పాటు స్పెషల్ ఐడెంటిటీ మెరుగైన సీటు, అద్భుతమైన డిజైన్ వంటి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఫ్రంట్ సైడ్ అదనపు సామాను స్టోరేజీ స్పేస్, మొత్తం స్టోరేజీ సామర్థ్యం 35 లీటర్లకు పైగా పెరిగింది.