Sharad Pawar : గుజరాత్‌లో లాక్టోఫెర్రిన్ ప్లాంట్‌‌కు శరద్ పవార్ ప్రారంభోత్సవం

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ల మధ్య ఉన్న బంధం మరోసారి వెలుగుచూసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ అహ్మదాబాద్‌లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు....

Sharad Pawar : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ల మధ్య ఉన్న బంధం మరోసారి వెలుగుచూసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ అహ్మదాబాద్‌లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు. గుజరాత్‌ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ప్లాంట్‌ను ప్రారంభించిన శరద్ పవార్ గౌతమ్ అదానీతో కలిసి ప్రారంభించారు. (Sharad Pawar, Gautam Adani inaugurate Lactoferrin Plant ) అహ్మదాబాద్‌లోని సనంద్‌లోని ఒక గ్రామంలో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు.

Vikas Raj : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : ఎన్నికల అధికారి వికాస్ రాజ్

శరద్ పవార్ గౌతమ్ అదానీ ఫ్యాక్టరీ రిబ్బన్‌ను కత్తిరిస్తున్న ఫోటోలను ఎక్స్ సోషల్ మీడియా సైట్ లో పోస్ట్ చేశారు. ‘‘భారతదేశంలోనే మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ఎక్స్‌మ్‌పవర్‌ను గుజరాత్‌లోని చాచర్‌వాడిలోని వస్నాలో గౌతమ్ అదానీతో కలిసి ప్రారంభించడం ఒక విశేషం’’ అని శరద్ పవార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఒప్పందం ప్రకారం కవితను అరెస్ట్ చేసి రెండు నెలల్లో విడుదల చేస్తారు : రేవంత్ రెడ్డి

ఈ కార్యక్రమంతో శరద్ పవార్, అదానీల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి తెర మీదకు వచ్చింది. ఏప్రిల్ నెలలో గౌతం అదానీ ముంబయిలోని సిల్వర్ ఓక్ రెసిడెన్సీలో శరద్ పవార్ తో భేటీ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు