SIP Calculator
SIP Calculator : అందరూ డబ్బులు సంపాదిస్తారు.. కానీ, కొందరు మాత్రమే ఆ డబ్బును కూడబెడతారు.. మీరు కూడా మీ సంపాదించిన మొత్తంలో కొంతవరకు సరైన చోట ఇన్వెస్ట్ చేశారంటే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. కాస్తా మార్కెట్ రిస్క్ ఉంటుంది అనేమాట పక్కనపెడితే దీర్ఘకాలంలో భారీ మొత్తంలో సంపాందించుకోవచ్చు.
భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటినుంచే (SIP Calculator) పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాలి. అయితే, ప్రధానంగా అందరికి వచ్చే సందేహం.. చేతిలో డబ్బు ఉంది సరే.. అది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి.. అనేక పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్లాన్లను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే.. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు కూడబెట్టుకోవచ్చు.
ఇంతకీ.. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ మ్యాజిక్ ఏమిటంటే.. మీరు నెలకు కేవలం రూ. 250తో పెట్టుబడి పెట్టవచ్చు. ఎక్కువకాలం పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ పోతే మీరు సగటున 12శాతం రాబడిని పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి ఈ రాబడిలో లాభనష్టాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ (SIP)లో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎంతమొత్తంలో కూడబెట్టుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెలకు రూ. వెయ్యితో 10 ఏళ్లలో రాబడి ఎంతంటే? :
మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో 10 ఏళ్ల పాటు నెలకు రూ.1,000 మాత్రమే పెట్టుబడి పెడితే.. మీరు మొత్తం రూ.1,20,000 పెట్టుబడి పెడతారు. 12శాతం వద్ద మీరు మొత్తం రూ. 1,04,036 రాబడిని పొందుతారు. అప్పుడు మీకు మొత్తంగా రూ.2,24,036 కార్పస్ అందుతుంది.
SIP Calculator
మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో 20 ఏళ్ల పాటు నెలకు రూ. 1,000 మాత్రమే పెట్టుబడి పెడితే.. మీరు మొత్తం రూ. 240,000 పెట్టుబడి పెడతారు. 12శాతం వడ్డీ వద్ద మీరు మొత్తం రూ. 679,857 రాబడిని పొందుతారు. అంటే.. మీకు మొత్తం రూ. 919,857 కార్పస్ అందుతుంది.
నెలకు రూ. వెయ్యితో 30 ఏళ్లలో రాబడి ఎంతంటే? :
మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో 30 ఏళ్ల పాటు నెలకు రూ. 1,000 మాత్రమే పెట్టుబడి పెడితే.. మీరు మొత్తం రూ.360,000 పెట్టుబడి పెడతారు. 12శాతం వడ్డీ వద్ద మొత్తం రూ. 2,720,973 రాబడిని అందుకుంటారు. మీకు పెట్టుబడితో కలిపి మొత్తంగా రూ. 3080,973 కార్పస్ అందుతుంది.
Disclaimer : ఈ పెట్టబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి ఆ తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోండి.