Smart TVs Sale
Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అనేక బ్రాండ్ల టాప్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి టాప్ బ్రాండ్ల నుంచి లేటెస్ట్ స్మార్ట్‌టీవీలతో మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ సెటప్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌టీవీలపై ఇప్పుడు 60శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు మీ బెడ్‌రూమ్‌కి కాంపాక్ట్ మోడల్ కోసం చూస్తున్నా లేదా మీ లివింగ్ రూమ్‌కి పెద్ద స్క్రీన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. మీ బడ్జెట్‌కు సరిపోయే డీల్ అని చెప్పవచ్చు.
Read Also : Realme Narzo 70 Turbo 5G : భలే డిస్కౌంట్ బ్రో.. ఈ రియల్‌మి 5G ఫోన్‌పై ఊహించని ఆఫర్లు.. జస్ట్ ఎంతంటే?
VW 43-అంగుళాల ప్రో సిరీస్-V :
ఈ VW 43-అంగుళాల ప్రో సిరీస్ స్మార్ట్‌టీవీ 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. క్లియర్, పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. గూగుట్ టీవీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. వైడ్ రేంజ్ యాప్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సస్ అందిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ ఏ గదినైనా స్టైలిష్‌గా మారేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రూ.19,990 ధరకు లభిస్తోంది.
శాంసంగ్ 43-అంగుళాల ఫుల్ HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ :
ఈ శాంసంగ్ మోడల్ అద్భుతమైన ఫొటోల కోసం ఫుల్ HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీతో మీకు ఇష్టమైన కంటెంట్‌ను వీక్షించవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ఈజీ నావిగేషన్‌ను అందిస్తుంది. ఈ శాంసంగ్ టీవీ ధర రూ.23,990కు అందుబాటులో ఉంది.
సోనీ 65-అంగుళాల బ్రావియా 2 :
సోనీ 65-అంగుళాల బ్రావియా 2 టీవీ 4K అల్ట్రా HD డిస్‌ప్లేతో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. గూగుల్ టీవీతో ఇంటిగ్రేట్ అయ్యే వైడ్ రేంజ్ యాప్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు లభిస్తాయి. అయితే, ఆకర్షణీయమైన డిజైన్ మీ ఇంట్లో రూ. 76,990 ధరకు లభిస్తోంది.
శాంసంగ్ 43-అంగుళాల D టీవీ సిరీస్ :
శాంసంగ్ బ్రైటర్ క్రిస్టల్ 4K టెక్నాలజీని కలిగి ఉంది. క్లియర్ అండ్ మోడ్రాన్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ వివిధ రకాల స్ట్రీమింగ్ సర్వీసులకు కూడా యాక్సస్ పొందవచ్చు. ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే వారికి ఈ బెస్ట్ టీవీ అని చెప్పవచ్చు. ఈ టీవీ మోడల్ ధర రూ.30,990కు లభ్యమవుతుంది.
ఎల్‌జీ 50-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED టీవీ :
ఈ ఎల్‌జీ టీవీ 50-అంగుళాల మోడల్ అద్భుతమైన ఫొటో క్వాలిటీతో 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు అనేక స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి. ఆకర్షణీయమైన డిజైన్ మోడ్రాన్ ఇంటీరియర్‌లను కలిగి ఉంది. ఈ టీవీ ధర రూ. 36,990కు అందుబాటులో ఉంది.
సోనీ బ్రావియా 65-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీ :
ఈ సోనీ బ్రావియా మోడల్ అసాధారణమైన 4K అల్ట్రా HD విజువల్స్‌ను అందిస్తుంది. గూగుల్ టీవీ ఇంటిగ్రేషన్ వైడ్ రేంజ్ కంటెంట్‌కు యాక్సెస్‌తో వస్తుంది. రూ. 69,999 ధరకు లభించే ఈ స్మార్ట్‌టీవీ
యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. బిగ్ స్క్రీన్ సైజుతో మీ ఇంట్లో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
VW 43-అంగుళాల లినిక్స్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ ఫుల్ HD స్మార్ట్ LED టీవీ :
VW 43-అంగుళాల లినెక్స్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ ఫుల్ HD రిజల్యూషన్, ఫ్రేమ్‌లెస్ డిజైన్‌ను అందిస్తుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ వివిధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సస్ అందిస్తుంది. బడ్జెట్-ఫ్రెండ్లీ కానప్పటికీ ఫీచర్-రిచ్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ VW టీవీ ధర రూ.13,799 ధరకు అందుబాటులో ఉంది.
Read Also : Google Pixel 9 : కొత్త ఫోన్ కావాలా? ఈ గూగుల్ పిక్సెల్ 9పై ఏకంగా రూ.12వేలు తగ్గింపు.. డోంట్ మిస్!
TCL 40-అంగుళాల మెటాలిక్ బెజెల్-లో ఫుల్ HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ :
ఈ TCL టీవీ మోడల్ రూ. 15,990కు లభ్యమవుతుంది. అద్భుతమైన బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్, స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తాయి.
TCL 55-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ :
ఈ TCL 55-అంగుళాల టీవీ మోడల్ రూ. 36,990 ధరకు లభిస్తోంది. 4K అల్ట్రా HD రిజల్యూషన్, QLED టెక్నాలజీతో పవర్‌ఫుల్ కలర్లు, ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. గూగుల్ టీవీ ఇంటిగ్రేషన్ వైడ్ రేంజ్ యాప్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్‌ను అందిస్తుంది.