Sony Bravia 3II Smart TV : ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫీలింగ్.. కొత్త సోనీ బ్రావియా 3 II భారీ స్క్రీన్లతో వచ్చేసింది, ధర ఎంతంటే?

Sony Bravia 3II Smart TV : సోనీ బ్రావియా 3 IIను అనేక సైజుల్లో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ మే నెల నుంచి అనేక ప్లాట్‌ఫారాల్లో అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Sony Bravia 3II Smart TV ( Illustration generated using AI )

  • మాస్ మూవీలు ఇక మాస్ స్క్రీన్‌పైనే.. కొత్త సోనీ బ్రావియా 3 II టీవీలు లాంచ్
  • సోనీ బ్రావియా 3 II 55 నుంచి 85-అంగుళాల డిస్‌ప్లేలు
  • 100Hz రిఫ్రెష్ రేట్‌, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లేలకు సపోర్టు
  • అతి త్వరలో 100-అంగుళాల స్మార్ట్ టీవీ మోడల్ లాంచ్

Sony Bravia 3II Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. కొత్త సోనీ బ్రావియా 3 IIను భారత మార్కెట్లో లాంచ్ అయింది. 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు 85-అంగుళాల డిస్‌ప్లేలలో లభిస్తుంది.

100-అంగుళాల మోడల్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌టీవీలు గూగుల్ టీవీ, గూగుల్ (Sony Bravia 3II Smart TV) అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే, హోమ్‌కిట్, సోనీ పిక్చర్ కోర్, గూగుల్ జెమినిలకు సపోర్ట్ చేస్తాయి.

ఈ టీవీలలో 4K UHD ఎల్‌సీడీ డైరెక్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. దీనికి 100Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సోనీ బ్రావియా 3II ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సోనీ బ్రావియా 3 II ధర ఎంతంటే? :
సోనీ బ్రావియా 3II స్మార్ట్‌టీవీ ధర 55-అంగుళాల మోడల్‌కు రూ. 99,990, 65-అంగుళాల మోడల్‌కు రూ. 1,24,990, 75-అంగుళాల మోడల్‌కు రూ. 1,79,990, 85-అంగుళాల మోడల్‌కు రూ. 3,05,990గా ఉంది. 100-అంగుళాల మోడల్ 2026 జూలై ఆగస్టు మధ్య లాంచ్ అవుతుంది.

సోనీ బ్రావియా 3II భారత మార్కెట్లో 2026 మే నుంచి సోనీ రిటైల్ స్టోర్‌లు, సోనీ ఎక్స్‌క్లూజివ్ అవుట్‌లెట్‌లు, షాప్‌ఎట్‌ఎస్‌సీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది.

సోనీ బ్రావియా 3II స్పెసిఫికేషన్లు :
సోనీ బ్రావియా 3II టీవీ K-55XR35M2 మోడల్‌లో 55-అంగుళాల డిస్‌ప్లే, K-65XR35M2 మోడల్‌లో 65-అంగుళాల డిస్‌ప్లే, K-75XR35M2 మోడల్‌లో 75-అంగుళాల డిస్‌ప్లే K-85XR35M2 మోడల్‌లో 85-అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి.

Read Also : Vivo Y60 Launch : తక్కువ ధరలో భారీ బ్యాటరీ.. కొత్త వివో Y60 ఫోన్ కేక.. ఫీచర్ల కోసమైన కొనేస్తారు!

ఈ డిస్‌ప్లే 100Hz రిఫ్రెష్ రేట్‌తో 4K UHD ఎల్‌సీడీ డైరెక్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే XR ప్రాసెసర్, XR ట్రైలుమినోస్ ప్రో, XR క్లియర్ ఇమేజ్, మోషన్‌ఫ్లో XR 400, HDR10/HLG/డాల్బీ విజన్‌లకు సపోర్ట్ చేస్తుంది.

ఆడియో కోసం 20W 2-ఛానల్ స్పీకర్లు, బాస్ రిఫ్లెక్స్ + ఎక్స్-బ్యాలెన్స్‌డ్ స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ DTS:X ఉన్నాయి. గేమింగ్ కోసం 4 HDMI 2.1, 4K 120Hz, VRR, ALLM, eARC, డాల్బీ విజన్ గేమింగ్, గేమ్ మెనూ, PS5 ఆప్టిమైజేషన్ ఉన్నాయి.

ఈ టీవీలు గూగుల్ టీవీ, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే, హోమ్‌కిట్, సోనీ పిక్చర్ కోర్ గూగుల్ జెమినిలకు సపోర్టు ఇస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్ 5.3,2x USB,LAN,RF శాటిలైట్ ఇన్‌పుట్‌లు ఉన్నాయి.

ఈ టీవీలో ఫ్లష్ సర్ఫేస్ బెజెల్స్, బ్లాక్ కలర్ ఫినిష్ సన్నని టీ-ఆకారపు స్టాండ్ డిజైన్ ఉన్నాయి. ఈ టీవీ సిస్టమ్ DVB-T2/DVB-S2/ అనలాగ్ B/Gతో వస్తుంది. టాక్‌బ్యాక్, ఆడియో సమ్మరీ, సబ్‌టైటిల్ సపోర్టు, వాయిస్ కంట్రోల్ కలర్ ఇన్వర్షన్/కరెక్షన్ టూల్స్ అందిస్తుంది.