Vivo Y60 Launch : తక్కువ ధరలో భారీ బ్యాటరీ.. కొత్త వివో Y60 ఫోన్ కేక.. ఫీచర్ల కోసమైన కొనేస్తారు!
Vivo Y60 Launch : వివో నుంచి అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. 6500mAh బ్యాటరీ, 13MP కెమెరాతో వచ్చింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ 10X వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది.
Vivo Y60 Launch ( Illustration generated using AI )
- వివో ఫోన్లో 13MP రియర్ మెయిన్ కెమెరా ఉంది
- ఈ ఫోన్‌తో 1080pలో వీడియోను రికార్డ్ చేయొచ్చు
- డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ ఆప్షన్
Vivo Y60 Launch : వివో ఫ్యాన్స్ కోసం సరికొత్త ఫోన్ వచ్చేసింది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వివో Y60 లాంచ్ అయింది. వివో ఈ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లో 8GB ర్యామ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో రన్ అవుతుంది.
ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6500mAh బ్యాటరీ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు (Vivo Y60 Launch) సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ బ్యాక్ కెమెరా ఉంది. అలాగే స్పెసిఫికేషన్లలో అనేక ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్లపై ఓసారి వివరంగా తెలుసుకుందాం..
వివో Y60 ధర, లభ్యత :
వివో Y60 బేస్ వేరియంట్ ధర 1,799 యువాన్లు (సుమారుగా రూ. 25వేలు). 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్‌ను 1,999 యువాన్లకు (సుమారుగా రూ. 28వేలు) కొనుగోలు చేయవచ్చు.
టాప్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ధర 2999 యువాన్లు (సుమారుగా రూ. 32వేలు). ఈ ఫోన్‌ను లక్కీ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్ షాన్హైకింగ్ (చైనీస్) షేడ్స్‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
వివో Y60 స్పెసిఫికేషన్లు :
వివో Y60లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ డ్యూయల్-సిమ్ ఫోన్, ఆరిజిన్ OS6తో పాటు ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. 16.7 మిలియన్ కలర్లకు సపోర్ట్ చేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది.
4nm ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆధారిత ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రినో 613 జీపీయూతో రన్ అవుతుంది. కంపెనీ 8GB వరకు LPDDR4x ర్యామ్ అందించింది. ఈ ఫోన్లో 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఆప్షన్ అందిస్తుంది.
వివో Y60లో 10X వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్టు ఇచ్చే 13MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 1080pలో వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఇందులో 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,500mAh బ్యాటరీ కూడా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లో 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ కూడా ఉంది. కొలతలు 167.4×77.1×8.39mm, బరువు 209 గ్రాములు ఉంటుంది.
