SGB Scheme : మార్కెట్ కంటే తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం.. కేవలం ఐదు రోజులే అవకాశం.. ఎక్కడో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా గోల్డ్ బాండ్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ చేసింది. మంచి స్పందన రావడంతో ఇప్పటి వరకు మూడుసార్లు బాండ్లు జారీ చేసింది.

Sovereign Gold Bond Scheme

Sovereign Gold Bond 4th Series : బంగారంలో పెట్టుబడి పెట్టడం అంటే దానిని ఆభరణాలుగా కొనడం అని చాలా మందికి తెలుసు. కానీ, ఆభరణాల కంటే, బంగారు బాండ్లలో మీరు కొనుగోలు చేసే బంగారం కూడా మీకు వడ్డీని సంపాదించి పెడుతుంది. పెట్టుబడిగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి డబ్బును వృథా చేయకుండా బాండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. దీని ప్రకారం.. ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నాల్గో సిరీస్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం స్వచ్ఛమైన బంగారాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బాండ్ల రూపంలో విక్రయిస్తుంది. ఎస్జీబీ (సావరిన్ గోల్డ్ బాండ్) స్కీం 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు రోజుల్లో మీరు కాస్త తక్కువ ధరకు బంగారాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది.

Also Read : Sovereign Gold Bond Scheme: ఆగస్ట్ 9నుంచి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్

కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా గోల్డ్ బాండ్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ చేసింది. మంచి స్పందన రావడంతో ఇప్పటి వరకు మూడుసార్లు బాండ్లు జారీ చేసింది. నాల్గో విడతలో ఇవాళ్టి నుంచి బాండ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఐదు రోజులు పాటు .. అంటే ఈనెల 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను షెడ్యూల్డ్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీ నుంచి కొనుగోలు చేయొచ్చు. నాల్గో విడతలో ఒక గ్రాము బంగారం ధరను రూ. 6,263 ఆర్బీఐ నిర్ణయించింది. అంటే మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇక్కడి నుంచి బంగారాన్ని కోనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు, మీరు ఆన్ లైన్ లో పెట్టుబడి పెడితే గ్రాము పై రూ. 50 తగ్గింపు ఉంటుంది. ఈ గోల్డ్ బాండ్లు కొనేవారు కనీసం ఒక గ్రాము తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read : Sovereign Gold Bond Scheme : అదిరిపోయే స్కీమ్.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలపై పన్ను పడదు

సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం కింద ఒక వ్యక్తి, కుటుంబాలు గరిష్ఠంగా 4కేజీలు బంగారం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రస్టులు 20 కేజీల బంగారం కొనేందుకు వీలుంటుంది. బాండ్ కాల పరిమితి 8 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో పెట్టుబడిపై ఏడాదికి 2.5శాతం చొప్పున ప్రతీ ఆరు నెలలకు వడ్డీ జమ అవుతుంది. బాండ్ గడువు ముగిసిన తరువాత వడ్డీతోపాటు బంగారంకు అప్పుడు ఉన్న ధరను చెల్లిస్తారు. మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. బాండ్ కొన్న ఐదేళ్ల తరువాత ఎప్పుడైనా మీరు పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం ద్వారా.. మీరు స్వచ్ఛమైన బంగారాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ పథకం కింద బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మీరు ఎక్కువ రాబడిని పొందుతారు. అంతేకాక.. ప్రస్తుత కాలంలో బంగారాన్ని భద్రపర్చడంకూడా కొందరికి సమస్యే.. సావరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల ఛార్జీల బారం తగ్గడంతోపాటు, చోరీల భయం ఉండదు.

 

ట్రెండింగ్ వార్తలు