ఢిల్లీ: వంట గ్యాస్ ధరలు తగ్గాయి. నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 30 రూపాయలు తగ్గింది. ఇంటికొచ్చే 14 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై మాత్రం రూపాయి 46 పైసలు మాత్రమే తగ్గించారు. ఈ ధరలతో.. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.493.53 కానుంది. గతంలో ఈ ధర రూ. 494.99 పైసలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడమే ఇందుకు కారణం అని చమురు కంపెనీలు తెలిపాయి. అయితే వంట గ్యాస్ ధరలు తగ్గించి బడ్జెట్ ముందు ప్రజలకు ఊరట ఇచ్చారు అని జనాలు అనుకోవడం లేదు. సరికదా.. తగ్గించిన ధరలు చూసి నవ్వుకుంటున్నారు.
* ధరలు తగ్గడం ఇది వరుసగా మూడోసారి
* 2018 డిసెంబర్ 1వ తేదీన రూ.6.52 పైసలు తగ్గింపు.
* జనవరి 1వ తేదీన రూ.5.91 పైసలు తగ్గింపు.
* ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.659