Syngenta: వ్యవసాయ రంగంలో డ్రోన్లు వినియోగించాలన్న ప్రధాని లక్ష్యానికి అనుగుణంగానే..
భారతదేశంలో స్ర్పేయింగ్ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఐఓటెక్ వరల్డ్ ఏవిగేషన్ డైరెక్టర్ దీపక్ భరద్వాజ్ అన్నారు. సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఓటెక్‌ల ఉమ్మడి ప్రయత్నాలలో భాగంగా అర్హులైన అగ్రి ఎంటర్‌ప్రిన్యూర్స్(ఏఈలు)ను గుర్తించి డ్రోన్ పైలెట్ శిక్షణను సిన్జెంటా ఫౌండేషన్ ఇండియా అందిస్తుంది
- tony bekkal
- Published On : February 10, 2023 / 06:26 PM IST
Syngenta and IoTech join hands to make drones a part of agriculture sector
వ్యవసాయ రంగంలో పెద్ద సంఖ్యలో డ్రోన్లను వినియోగించాలనే ప్రధాన మంత్రి లక్ష్యానికి అనుగుణంగా, సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐపీఎల్) ఐఓ టెక్ వరల్డ్ ఏవిగేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని భారతదేశ వ్యాప్తంగా డ్రోన్ స్ర్పేయింగ్‌ను పరిచయం చేయబోతుంది. ఈ ఒప్పందంలో భాగంగా, రెండు కంపెనీలూ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంపై కలిసి పనిచేయడంతో పాటుగా డ్రోన్ సాంకేతికత కోసం వారిని సిద్ధం చేయనున్నాయి.
Shankar: శంకర్ డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ.. అయినా ఆసక్తి చూపని ఆడియెన్స్..?
ఈ రెండు కంపెనీలూ భారతదేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో ఐఓ టెక్ వరల్డ్‌యొక్క డ్రోన్ సాంకేతికత వినియోగించి సిన్జెంటా అనుమతించిన రసాయనాలను స్ర్పే చేయడం గురించి కలిసి పనిచేయనున్నాయి. ‘‘మొదటి దశలో 200 మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించడంతో పాటుగా స్ర్పేయింగ్ కోసం విధులలో నియమించనున్నాము. భారీ స్ధాయిలో 400 ఎకరాలపై ట్రయల్స్ చేసిన తరువాత 20 పంటలకు సంబంధించి డాటాను రెగ్యులేటర్లకు సమర్పించడం జరిగింది’’ అని సిన్జెంటా ఎండీ– కంట్రీ హెడ్ సుశీల్ కుమార్ అన్నారు.
Formula E Hyderabad: ఏమిటి ఈ ఫార్ములా-ఈ?.. భాగ్యనగరంలో ఈ రేస్ ప్రత్యేకత ఏంటి?
సిన్జెంటా స్ర్పే సేవలు, ఉత్పత్తుల వ్యాప్తంగా ఐఓ టెక్ యొక్క డ్రోన్ అగ్రిబాట్‌ను వినియోగించనున్నారు. భారత ప్రభుత్వ సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డ్ నుంచి అనుమతులు పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీ సిన్జెంటా. ‘‘ఈ అనుమతులు అందించిన ప్రోత్సాహంతోనే సిన్జెంటా ఇప్పుడు వినూత్నమైన డ్రోన్ యాత్ర చేస్తుంది. దీనిలో భాగంగా 13 రాష్ట్రాల్లో 17వేల కిలోమీటర్లు మేర వ్యాన్‌లో తిరుగుతూ డ్రోన్ స్ర్పేయింగ్ పట్ల అవగాహన కల్పించనున్నాము’’ అని సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మర్ సెంట్రిక్ ఎకోసిస్టమ్ హెడ్ సచిన్ కమ్రా అన్నారు.
Mallikarjun Kharge: విపక్షాలు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ
‘‘భారతదేశంలో స్ర్పేయింగ్ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఐఓటెక్ వరల్డ్ ఏవిగేషన్ డైరెక్టర్ దీపక్ భరద్వాజ్ అన్నారు. సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఓటెక్‌ల ఉమ్మడి ప్రయత్నాలలో భాగంగా అర్హులైన అగ్రి ఎంటర్‌ప్రిన్యూర్స్(ఏఈలు)ను గుర్తించి డ్రోన్ పైలెట్ శిక్షణను సిన్జెంటా ఫౌండేషన్ ఇండియా అందిస్తుంది’’ అని సంస్థ కంట్రీ డైరెక్టర్ రాజేంద్ర జోగ్ అన్నారు.
