Tata Harrier EV
Tata Harrier EV : టాటా లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ప్రముఖ భారతీయ కార్ల తయారీదారు టాటా మోటార్స్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త కార్ల మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే అనేక మోడల్ కార్లు లాంచ్ అయ్యాయి.
అందులో ముఖ్యంగా టాటా ఈవీ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. టాటా EV కేటగిరీలో కూడా అనేక కార్లను అందిస్తుంది. టాటా అత్యంత ఖరీదైన ఈవీని తక్కువ ధర చెల్లించి కొనేసుకోవచ్చు. కనీస డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? నెలకు మొత్తంగా ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు :
టాటా అత్యంత ఖరీదైన ఈవీ టాటా హారియర్ ఈవీ కారు ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి లభ్యమవుతుంది. అయితే, టాటా వేరియంట్‌ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. టాప్-స్పెక్ టాటా హారియర్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 30.23 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మీరు ఢిల్లీలో టాప్-స్పెక్ టాటా హారియర్ ఈవీ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం రూ. 11వేలు, ఇన్సూరెన్స్ కోసం రూ. 1.07 లక్షలు చెల్లించాలి. ఇతర ఛార్జీలతో కలిపి టాటా హారియర్ ఈవీ కోసం దాదాపు రూ. 31.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది.
Read Also : BSNL Cheapest Plan : BSNL యూజర్లకు లాస్ట్ ఛాన్స్.. రూ. 1కే రీఛార్జ్ ప్లాన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..
కనీస డౌన్ పేమెంట్ ఎంతంటే? :
మీరు టాటా హారియర్ ఈవీ టాప్ వేరియంట్‌ను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే కనీసం రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత మీరు బ్యాంకు నుంచి రూ. 26.71 లక్షలు లోన్ తీసుకోవాలి.
టాప్ వేరియంట్ ఈఎంఐ ఎంతంటే? :
మీరు బ్యాంకు నుంచి 15 ఏళ్లకు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 26.71 లక్షల కారు లోన్ తీసుకోవాలి. మీరు నెలకు రూ. 27,091 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం 15 ఏళ్లకు నెలకు రూ. 27,091 ఈఎంఐ చెల్లిస్తే బ్యాంకుకు మొత్తం రూ. 48.76 లక్షలు చెల్లించాలి. ఇందులో రూ. 22.05 లక్షల వడ్డీ మాత్రమే చెల్లించాలి.
టాటా హారియర్ ఈవీ బ్యాటరీ :
టాటా హారియర్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌లలో 65kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈవీ పూర్తిగా ఛార్జ్ అయితే 622 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. ఈ హారియర్ ఈవీలో 360-డిగ్రీల కెమెరా, ట్రాన్స్ పరెంట్ మోడ్, బూస్ట్ మోడ్, రాక్ క్రాల్ మోడ్ వంటి ఆఫ్-రోడింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగులు, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ 22 లెవల్-2 ఫీచర్లతో కూడా వస్తుంది.