×
Ad

Tata Harrier EV : 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, సింగిల్ ఛార్జ్‌తో 600 కి.మీ రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ SUVపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు..!

Tata Harrier EV : టాటా హారియర్ ఈవీ కారుపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. డిసెంబర్‌ ఇయర్ ఎండ్ సేల్‌లో లక్ష తగ్గింపుతో కొనేసుకోండి.

Tata Harrier EV Year End Discounts

Tata Harrier EV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ డిసెంబర్ నెలలో టాటా హారియర్ ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఈ టాటా హారియర్ ఈవీ అత్యంత పవర్‌ఫుల్ మోడల్. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పాటు అనేక అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. లెవల్ 2 అడాస్ కూడా అందిస్తుంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షలు.

అయితే, ఈ డిసెంబర్‌లో (Tata Harrier EV) టాటా ఎలక్ట్రిక్ SUV కారులో సంవత్సరాంతపు రూ. లక్ష తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ కారు అన్ని వేరియంట్‌లపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 600 కి.మీ రేంజ్ అందిస్తుంది.

టాటా హారియర్ ఈవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

టాటా హారియర్ ఈవీలోని కొత్త 540-డిగ్రీల కెమెరా ఫంక్షన్ 360-డిగ్రీల సరౌండ్ వ్యూ మానిటర్ సిస్టమ్‌కు అడ్వాన్స్ యాంగిల్ కలిగి ఉంది. కారులో ఈ కొత్త యాంగిల్ ట్రాన్స్పరెంట్ మోడ్‌లో యాక్టివేట్ అవుతుంది. డ్రైవర్ ఆఫ్-రోడ్ భూభాగంలో కూడా భారీ గుంతలను నావిగేట్ చేస్తుంది.

హారియర్ ఈవీ మాస్-మార్కెట్ సెగ్మెంట్లో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెటప్‌ కలిగిన ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుగా చెప్పొచ్చు. ప్రతి యాక్సిల్‌పై ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. బూస్ట్ మోడ్‌ ద్వారా హారియర్ ఈవీ కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు.

స్టాండర్డ్ హారియర్‌లో నార్మల్, రఫ్, వెట్ అనే 3 టెర్రైన్ మోడ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రిక్ హారియర్ కోసం టాటా మోటార్స్ మొత్తం 6 మల్టీ-టెర్రైన్ మోడ్‌లను ప్రవేశపెట్టింది. అందులో నార్మల్, మడ్ రట్స్, రాక్ క్రాల్, సాండ్, స్నో గ్రాస్ కస్టమ్ ఉన్నాయి.

Read Also : 2025 Year-End Discounts : ఇప్పుడే కొనడం బెటర్.. ఈ టాప్ 5 SUVలపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు.. ఏ కారుపై డిస్కౌంట్ ఎంతంటే?

ఈ మోడ్‌లు పవర్ డెలివరీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, థ్రోటిల్ రెస్పాన్స్‌ను మార్చి SUV కష్టతరమైన భూభాగాల్లో కూడా ఈజీగా దూసుకెళ్లగలదు. అంతేకాదు.. టాటా మోటార్స్ హారియర్ ఈవీతో కొత్త 14.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ప్రవేశపెట్టింది. టాటా కారులో అతిపెద్దది.

ఈ శాంసంగ్ రూపొందించిన నియో QLED డిస్‌ప్లే వినియోగదారులకు క్లియర్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. హారియర్ ఈవీ షార్క్ ఫిన్ యాంటెన్నాలో ఇంటిగ్రేట్ చేసిన అదనపు కెమెరా కూడా కలిగి ఉంది. ఈ కెమెరా నుంచి ఫీడ్ డిజిటల్ IRVMలో డిస్‌ప్లే అవుతుంది. ఈ కారు బ్యాక్ సైడ్ ఏమి ఉందో క్లియర్ వ్యూను అందిస్తుంది. రికార్డింగ్ ఫంక్షన్‌ కూడా కలిగి ఉంది. మెరుగైన సేఫ్టీ కోసం డాష్‌క్యామ్‌గా పనిచేస్తుంది.

BNCAPలో 5-స్టార్ రేటింగ్ :
భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ప్రయాణీకుల సేఫ్టీ కోసం 32/32, పిల్లల ప్రొటెక్షన్ కోసం 45/49 స్కోర్ చేసింది. కంపెనీ టాటా హారియర్ EVతో రాళ్లతో కూడిన రోడ్లపై కూడా ఆఫ్‌రోడింగ్ చేసింది. నిటారుగా ఉన్న ఉపరితలాలపై ఈజీగా ప్రయాణించగలదు.

ట్యాంక్‌ను కూడా వేగంగా లాగగలదు. బురద, నీటితో నిండిన మార్గాల్లో కూడా బయటకు రాగలదు. అంతమాత్రమే కాదు.. ఈ EV కారు ఎత్తుపల్లాల రోడ్లపై పైకి ఎగిరి దూకగలదు. మొత్తంమీద, ఈ ఎలక్ట్రిక్ కారు సులభం కానీ విన్యాసాలను కూడా ప్రదర్శించింది. ఈ కారులోని బాడీ షెల్ సామర్థ్యాన్ని టెస్టింగ్ చేసేందుకు కారు పైన 1.5 టన్నుల కంటైనర్‌ను కూడా ఉంచారు.