Tata Nano EV 2025
Tata Nano EV 2025 : మిడిల్ క్లాస్ డ్రీమ్ కారు టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ రాబోతుంది.. అప్పట్లో టాటా నానో కారు భారతీయ రోడ్లపై సంచలనం సృష్టించింది. టాటా నానో ఎలక్ట్రిక్ (Tata Nano EV 2025) కారు ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో పుకార్లు నమ్మితే.. ఈ నానో ఈవీ కారు ఆగస్టు 2026 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టాటా నానో ఎలక్ట్రిక్ కారు నిజంగానే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే.. కస్టమర్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ఈ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి, మీరు నానో ఈవీ కారు ప్రత్యేక ఫీచర్లలో స్పీడ్, డిజైన్, లుక్ గురించి అంచనాలపై వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా నానో ఎలక్ట్రిక్ ఫీచర్లు (అంచనా) :
టాటా నానో ఎలక్ట్రిక్ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికొస్తే.. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండొచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్టు ఇవ్వగలదు.
Read Also : PM Kisan : రైతులకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్‌లో పేరు తప్పుందా? ఈ 5 తప్పులు ఉంటే.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడవు..!
ఈ కారుకు 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కూడా చేర్చవచ్చు. బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో రావచ్చు. నానో ఈవీ కారు సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో కూడిన ABS, పవర్ విండోస్, యాంటీ-రోల్ బార్ వంటి ఆప్షన్లను కలిగి ఉండొచ్చు. రిమోట్ యాక్టివిటీ, డెమో మోడ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. మల్టీ-డేటా డిస్‌ప్లే ఫీచర్ కూడా చేర్చే అవకాశం ఉంది.
నానో ఈవీ కారు రేంజ్, ధర? :
టాటా నానో ఎలక్ట్రిక్ కారు హై రేంజ్‌లో ఉంటుందని అంచనా. బ్యాటరీ పవర్ అత్యంత పవర్‌ఫుల్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250కి.మీ నుంచి 260 కిలోమీటర్లు ప్రయాణించగలదు. టాటా నానో ఎలక్ట్రిక్ ధర రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ రేంజ్ మోడల్ మరింతగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
Disclaimer : టాటా ఎలక్ట్రిక్ కారు వస్తుందంటూ ఇంటర్నెట్‌లో పుకార్లు వస్తున్నాయి. వాస్తవానికి, టాటా కంపెనీ ఇంకా నానా ఈవీ కారు లాంచ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం పుకార్ల ఆధారంగా నానో ఈవీ కారుకు సంబంధించి సమాచారం మాత్రమే..