Tata Punch EV Launch : టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 421కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతో తెలుసా?

Tata Punch EV Launch : భారత మార్కెట్లోకి కొత్త టాటా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టైగర్.ఈవీ, టాటా టయాగో.ఈవీ తర్వాత టాటా పంచ్.ఈవీ టాటా మోటార్స్ యొక్క 4వ ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అయింది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tata Punch EV launched in India, price starts at Rs 10.99 lakh

Tata Punch EV Launch : ప్రముఖ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారత మార్కెట్లో జనవరి 17న టాటా పంచ్.ఈవీ కారును రూ. 10.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Tata Punch EV  price

అయితే, ప్రారంభ ధరలు పరిమిత కాలానికి వర్తిస్తాయని గమనించాలి. టాటా పంచ్.ఈవీ అనేది టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన సరికొత్త అధునాతన ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్ ఏసీటీఐ.ఈవీ (అధునాతన కనెక్ట్ చేసిన టెక్-ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వాహనం)పై ఆధారపడి పనిచేస్తుంది.

సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 421 కిలోమీటర్లు రేంజ్ :
కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్.ఈవీ టెక్నాలజీ ఫీచర్లలో ప్రామాణిక మోడల్‌ 60కిలోవాట్/114ఎన్ఎమ్ శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ ఏసీ మోటార్ అమర్చబడి ఉంటుంది. అయితే, లాంగ్ రేంజ్ మోడల్ 90కిలోవాట్/190ఎన్ఎమ్ శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ ఏసీ మోటార్‌ను పొందుతుంది.

Tata Punch EV launched

Read Also : Hyundai Cars Big Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ జనవరిలో హ్యుందాయ్ కార్లపై రూ. 50వేల వరకు డిస్కౌంట్లు..!

25కెడబ్ల్యూ‌హెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ప్రామాణిక మోడల్ 315కిలోమీటర్ల (MIDC) క్లెయిమ్ పరిధిని కలిగి ఉంది. లాంగ్ రేంజ్ మోడల్ 35కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ ద్వారా సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 421 కిలోమీటర్లు (MIDC) పరిధిని అందిస్తుంది. మోటారు, బ్యాటరీ ప్యాక్ ఐపీ67-రేటెడ్, ఎనిమిదేళ్లు లేదా 1 లక్ష 60వేల కిలోమీటర్ల (ఏది ముందైతే అది) వారంటీని కలిగి ఉంటాయి.

Tata Punch EV

ఏ బ్యాటరీతో ఎన్ని గంటల్లో ఛార్జ్ చేయొచ్చుంటే? :
టాటా పంచ్.ఈవీ మోడల్ 3.3కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 9.4 గంటల్లో 10 నుంచి 100శాతం, 7.2కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 3.6 గంటల్లో, 15ఏ ప్లగ్ పాయింట్‌ను 9.4 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. 50కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 56 నిమిషాల్లో 10 నుంచి 80శాతం నుంచి ఛార్జ్ చేయవచ్చు.

Tata Punch EV launch Sale

టాటా పంచ్.ఈవీ లాంగ్ రేంజ్ 3.3కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్, 15 ఏ ప్లగ్ పాయింట్ ద్వారా 10-100శాతం ఛార్జ్ చేయడానికి 13.5 గంటలు పడుతుంది. 7.2కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా ఇదే విధమైన ఛార్జీకి 5 గంటలు పడుతుంది. 50కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80శాతం ఛార్జ్ అవుతుంది.

Tata Punch EV India price

న్యూ జనరేషన్స్ డ్రైవింగ్ మోడ్స్ :
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎకో, సిటీ, స్పోర్ట్ మూడు డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. కనిష్ట, ఇంటర్మీడియట్ యాడ్ మ్యాగ్జిమమ్ అనే న్యూ జనరేషన్స్ మోడ్స్ ఉన్నాయి. రీజెన్ మోడ్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ఇతర వాటిలో వెహికల్ అన్‌లాడెన్ గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎమ్ఎమ్, వాటర్ వాడింగ్ సామర్ధ్యం 350ఎమ్ఎమ్ ఉన్నాయి. వేరియంట్‌ల విషయానికి వస్తే.. టాటా పంచ్.ఈవీలో స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లు ఉండగా.. అందులో ఎంపవర్డ్ రెడ్, సీవీడ్, ఫియర్‌లెస్ రెడ్, డేటోనా గ్రే ప్రిస్టైన్ వైట్ అనే ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

Tata Punch EV price starts Rs 10.99 lakh

టాటా పంచ్.ఈవీ అత్యాధునిక స్పెషిఫికేషన్లు :
టాటా పంచ్.ఈవీ అనేది టాటా నెక్సాన్.ఈవీలో కనిపించే అదే డిజైన్ లాంగ్వేజీపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ స్ట్రిప్ రన్ అవుతుంది. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బ్యాక్ డిజైన్ టాటా పంచ్ పెట్రోల్ మాదిరిగానే ఉంటుంది.

Tata Punch EV Bookings

ఈ వెహికల్ 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై ఆధారపడి ఉంటుంది. టాటా పంచ్.ఈవీ క్యాబిన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉన్న సెగ్మెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటే చాలా ఖరీదైనది. లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఏక్యూఐ డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యూఎస్‌బీ టైప్ ఉన్నాయి. సి-ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ (45డబ్ల్యూ), ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఇల్యూమినేటెడ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్, బ్యాక్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి.

Tata Punch EV Seating Streeing Wheels

టాటా పంచ్.ఈవీ ఒక ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో అమర్చబడి ఉంది. హర్మాన్ ద్వారా 10.25-అంగుళాల టచ్ ఇన్ఫోటైన్‌మెంట్, 10-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఎంబెడెడ్ నావిగేషన్ వ్యూ, మల్టీ వాయిస్ అసిస్టెంట్ల సపోర్ట్ (అలెక్సా, సిరి), గూగుల్ అసిస్టెంట్, హే టాటా) వంటి 6 భాషల్లో 200కి పైగా వాయిస్ కమాండ్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (లాంగ్ రేంజ్‌ ఓన్లీ), ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

6 ఎయిర్ బ్యాగులు, మరెన్నో సేఫ్టీ ఫీచర్లు :
అర్కేడ్.ఈవీతో పంచ్.ఈవీలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఇప్పటి వరకు 17 యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. (ZConnect) కార్ టెక్నాలజీ స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీతో ప్రామాణికంగా అందిస్తుంది. టాటా మోటార్స్ భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లను ప్రవేశపెట్టడంలో ప్రసిద్ధి చెందింది.

Tata Punch EV  Air Bags and Saftey Features

కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ (ISOFIX), రోల్-ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్, హైడ్రాలిక్ ఫేడింగ్ కాంపెన్సేషన్ వంటి అనేక భద్రతా ఫీచర్లను అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా అందించింది. ఇ-కాల్, బి-కాల్‌తో ఎస్ఓఎస్ కాలింగ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు అధిక ట్రిమ్‌లలో అందిస్తోంది.

Read Also : Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ భారత్‌కు వచ్చేస్తోంది.. ఈరోజే లాంచ్.. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలంటే?

ట్రెండింగ్ వార్తలు