×
Ad

Tata Punch Facelift : కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసిందోచ్.. ధర జస్ట్ రూ. 5.59 లక్షలే.. సేఫ్టీ ఫీచర్లు మాత్రం హైలెట్..!

Tata Punch Facelift : టాటా మోటార్స్ కొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ కారు చూశారా? అడ్వాన్స్ ఫుల్ సేఫ్టీ ఫీచర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ధర కూడా రూ. 5.59 లక్షలు మాత్రమే..

Tata Punch (Image Credit To Original Source)

  • కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ఫుల్ డిజైన్, సేఫ్టీ ఫీచర్లు
  • పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఇంజన్ ఆప్షన్లు
  • ప్రారంభ ధర రూ. 5.59 లక్షల నుంచి రూ. 10.54 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)

Tata Punch Facelift : టాటా లవర్స్ కోసం సరికొత్త SUV మోడల్ వచ్చేసింది. టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో SUV పంచ్ కొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ చేసింది. ఈ కొత్త పంచ్ ఇప్పుడు గతంలో కన్నా అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది.

ఈ టాటా పంచ్ సేఫ్టీ పరంగా చాలా అడ్వాన్స్. చూసేందుకు హైటెక్‌ ఫీచర్లతో కనిపిస్తోంది. ఇక కారు ధర విషయానికి వస్తే.. ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ రూ. 9.29 లక్షల వరకు ఉంటుంది. కొత్త పంచ్‌లో కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా ఫస్ట్ టర్బో ఇంజిన్ :
కొత్త పంచ్ కారులో అతిపెద్ద హైలైట్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (iTurbo). టాటా నెక్సాన్ నుంచి ఈ ఇంజన్ 120 PS పవర్, 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ స్పీడ్, పర్మార్ఫెన్స్ ఇష్టపడే వారికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

సెగ్మెంట్ ఫస్ట్ CNG + AMT :
టాటా మరో రికార్డును సృష్టించింది. పంచ్ CNG ఇప్పుడు ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ప్యాడిల్ షిఫ్టర్‌తో కూడా వస్తుంది. టాటా డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. 210 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ కూడా అందిస్తుంది.

Tata Punch Facelift  (Image Credit To Original Source)

సేఫ్టీలో నంబర్ వన్ :
టాటా పంచ్ ఇప్పటికే భారత్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్‌ పొందింది. కంపెనీ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ESP (స్టెబిలిటీ కంట్రోల్) మల్టీ డ్రైవింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also : Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఈసారి ఏకంగా ఎంత తగ్గిందంటే? ఫుల్ డిటెయిల్స్!

4. టాటా పంచ్ వేరియంట్లు, ఫీచర్లు :
కొత్త పంచ్ 6 వేరియంట్లలో లాంచ్ : స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్

స్మార్ట్ (బేస్ వేరియంట్) : ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త స్టీరింగ్ వీల్ రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు

ప్యూర్ అండ్ ప్యూర్+ : 8-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్యాక్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే

అడ్వెంచర్ : 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్లు

అకంప్లిష్డ్ + (టాప్ వేరియంట్‌లు) : పనోరమిక్ సన్‌రూఫ్, భారీ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ iRA కనెక్ట్ కార్ టెక్నాలజీ

5. డిజైన్‌లో ఎలా ఉందంటే? :
కొత్త పంచ్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. హెడ్‌లైట్లు, గ్రిల్ బంపర్‌ రీడిజైన్, బ్యాక్ సైడ్ ఫుల్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్ బార్ ఉంది. రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తుంది.
సైంటిఫిక్, కారామెల్, ప్రిస్టిన్ వైట్, బెంగాల్ రూజ్, డేటన్ గ్రే కూర్గ్ క్లౌడ్స్ అనే 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కొత్త టాటా పంచ్ బడ్జెట్‌లో సేఫ్, స్టైలిష్ ఫీచర్లతో కొత్త SUV కోసం చూస్తున్న వారికి అద్భుతమైన ఆప్షన్.