Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఈసారి ఏకంగా ఎంత తగ్గిందంటే? ఫుల్ డిటెయిల్స్!

Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్ కొనుగోలుపై రూ. 18వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ మీకోసమే..

Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఈసారి ఏకంగా ఎంత తగ్గిందంటే? ఫుల్ డిటెయిల్స్!

Apple iPhone 16 Plus (Image Credit To Original Source)

Updated On : January 13, 2026 / 3:06 PM IST
  • భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్ ధర
  • విజయ్ సేల్స్‌లో రూ. 18వేలు తగ్గిన ఆపిల్ ఐఫోన్
  • ప్రస్తుతం ఈ ఐఫోన్ ధర కేవలం రూ. 71,890 మాత్రమే

Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ డీల్ మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు బెస్ట్ టైమ్. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో లాస్ట్ జనరేషన్ మోడల్ ఐఫోన్ ధర భారీగా తగ్గింది.

భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900కు లాంచ్ అయ్యే ప్రీమియం డిజైన్, డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ధర తగ్గింపుతో కస్టమర్‌లు ఇప్పుడు ఈ ఐఫోన్ రూ. 67వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు అప్‌గ్రేడ్ ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్ ముగిసేలోగా కొనేసుకోవచ్చు.

Apple iPhone 16 Plus

Apple iPhone 16 Plus (Image Credit To Original Source)

ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఐఫోన్ రూ. 71,890కు లభ్యమవుతుంది. ఫ్లాట్ డిస్కౌంట్ కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 5వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ. 3,127 నుంచి ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఫోన్ కొనేసుకోవచ్చు.

Read Also : SBI ATM Charges : బిగ్ బ్రేకింగ్.. ఎస్బీఐ ATM ఛార్జీలు పెరిగాయి.. ఇకపై అకౌంటులో డబ్బులు తీస్తే ఎంత చెల్లించాలంటే?

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ అల్యూమినియం ఫ్రేమ్‌‌తో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌‌తో వస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో వస్తుంది.