SBI ATM Charges : బిగ్ బ్రేకింగ్.. ఎస్బీఐ ATM ఛార్జీలు పెరిగాయి.. ఇకపై అకౌంటులో డబ్బులు తీస్తే ఎంత చెల్లించాలంటే?
SBI ATM Charges : ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది. ఇప్పుడు మీరు ఎంత అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందో వివరంగా తెలుసుకుందాం..
SBI ATM Charges Rule (Image Credit To Original Source)
- భారీగా పెరిగిన ఎస్బీఐ ఏటీఎం లావాదేవీల ఛార్జీలు
- సవరించిన కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచే అమల్లోకి
- గత ఫిబ్రవరి తర్వాత ఫస్ట్ టైమ్ ఏటీఎం ఛార్జీల పెంపు
- ప్రతి క్యాష్ విత్ డ్రాపై రూ.23, జీఎస్టీ చెల్లించాలి
- ఈ కస్టమర్లకు నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే
SBI ATM Charges : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం ఛార్జీలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా ఎస్బీఐ ఏటీఎం లావాదేవీ ఛార్జీలను సవరించింది. ఈ కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచే అమల్లోకి వచ్చాయి.
ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడే సేవింగ్స్ (శాలరీ) అకౌంట్ యూజర్లకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అయితే, కొన్ని ఎస్బీఐ అకౌంట్ల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఫ్రీ లిమిట్ దాటి ఇతర బ్యాంకుల్లో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసేవారి అకౌంట్లకు మాత్రమే ఛార్జీలను పెంచింది.
ఇటీవలే ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచిన ఎస్బీఐ.. ఏటీఎం సర్వీసు ఛార్జీలను సమీక్షించింది. ఫిబ్రవరి 2025 తర్వాత ఎస్బీఐ ఏటీఎం ఛార్జీలను పెంచడం ఇదే మొదటిసారి. ఎస్బీఐ ఏటీఎం లావాదేవీ ఛార్జీల పెంపుతో మీరు ఇప్పటినుంచి ఏటీఎంల్లో డబ్బులు విత్ డ్రా చేస్తే ఎంత అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతర బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలపై ఛార్జీలు :
ఎస్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. ఎస్బీఐ కస్టమర్లు ఫ్రీ లిమిట్ తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుంటే ఇప్పుడు ప్రతి లావాదేవీకి రూ. 23 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. గతంలో, ఈ రుసుము రూ. 21 ప్లస్ జీఎస్టీగా ఉండేది.

SBI ATM Charges Rule (Image Credit To Original Source)
అదనంగా, బ్యాలెన్స్ చెక్‌లు లేదా మినీ స్టేట్‌మెంట్‌లు వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు ఇప్పుడు రూ. 10 ప్లస్ జీఎస్టీ నుంచి రూ. 11 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్బీఐ కాకుండా ఇతర ఏటీఎంలలో సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు లావాదేవీ పరిమితి మారలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. వినియోగదారులు ఇప్పటికీ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. ఇందులో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండూ ఉన్నాయి. అయితే, ఈ లిమిట్ దాటిన తర్వాత మాత్రమే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.
శాలరీ ఖాతాదారులపై ఛార్జీల ఎఫెక్ట్ :
జీతం, ప్యాకేజీ సేవింగ్ అకౌంట్లు ఉన్న కస్టమర్లపై కూడా ఛార్జీల ప్రభావం పడింది. గతంలో, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్నిసార్లు అయినా ఫ్రీగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది.
కానీ, ఇప్పుడు ఈ లిమిట్ నెలకు 10 ఫ్రీ లావాదేవీలకు తగ్గించారు. ఫ్రీ లిమిట్ తర్వాత శాలరీ అకౌంటుదారులు క్యాష్ విత్ డ్రా చేస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ, ఇతర ఆర్థికేతర లావాదేవీలకు రూ. 11 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఏ అకౌంట్లపై ప్రభావం ఉండదంటే? :
- ఎస్బీఐ ప్రకారం.. కొంతమంది కస్టమర్లపై ఛార్జీల ప్రభావం ఉండదు.
- బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ప్రస్తుత ఛార్జీలే ఉంటాయి. ఎలాంటి మార్పు లేదు.
- ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎస్బీఐ ఏటీఎంలలో ఎస్బీఐ డెబిట్ కార్డుతో లావాదేవీలు పూర్తిగా ఉచితం.
- ఎస్బీఐ ఏటీఎం నుంచి కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఎప్పటిలాగే ఫ్రీగా ఉంటుంది. ఎలాంటి లిమిట్ లేదు.
- కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) అకౌంట్లకు కూడా ఈ ఛార్జీల ప్రభావం ఉండదు.
