Tata Punch Micro SUV: భారత కార్ల తయారీదారు టాటా మోటర్స్ మైక్రో ఎస్‌యూవీ ‘పంచ్’తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ.5.49లక్షలుగా ఉండగా.. ఇందులో హై మోడల్ క్రియేటివ్ ఏఎంటీ ట్రిమ్ ధర రూ.9.09లక్షలుగా ఉంది. ఈ కార్లకు సంబంధించి మార్కెట్లో ప్రస్తుతం ఆఫర్ ధరలు నడుస్తున్నాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
2022 జనవరి నుంచి ధరల్లో మార్పులుంటాయని, కారును ప్యూర్, అడ్వెంచర్, అకంప్లీష్డ్, క్రియేటివ్(Pure, Adventure, Accomplished and Creative) అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకుని వచ్చింది కంపెనీ. సరికొత్త మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్లో తన సత్తా చాటుకునేందుకు టాటామోటార్స్‌కు ఈ పంచ్ కారు సహాయం చేస్తుందని కంపెనీ భావిస్తుంది.
మారుతీ సుజుకీ ఎస్‌ప్రెస్సో, వేగన్ ఆర్, రేనాల్ట్ క్విడ్ వంటి వాహనాలు ఇప్పటికే ఇదే సెగ్మెంట్లో ఉండగా.. టాటా తీసుకుని వచ్చిన పంచ్‌ను మారుతీ సుజుకీ ఇగ్నీస్, స్విఫ్ట్, హ్యూందాయ్ i10 నియోస్ కార్లతో కంపేర్ చేస్తున్నారు. ఈ కారు సెక్యురిటీ విషయంలో గ్లోబల్ ఎన్‌సీఏపీ 5స్టార్ రేటింగ్ దక్కించుకుంది. కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. రూ.21వేలతో బుకింగ్ చేసుకోవాలని కంపెనీ కోరుతుంది.
టాటా పంచ్ ధరలు:
Tata Punch | Manual Transmission Prices | AMT (Automatic) Prices |
---|---|---|
Pure | రూ. 5.49లక్షలు | NA |
Adventure | రూ. 6.39లక్షలు | రూ. 6.99లక్షలు |
Accomplished | రూ. 7.29లక్షలు | రూ. 7.89లక్షలు |
Creative | రూ. 8.49లక్షలు | రూ. 9.09లక్షలు |
Customisation Packs | Rhythm | Rhythm | Dazzle | iRA |
---|---|---|---|---|
ధరలు | రూ.35,000 | రూ.35,000 | రూ.45,000 | రూ.30,000 |
Tata Punch | Dimensions |
---|---|
Length | 3827 mm |
Width | 1945 mm |
Height | 1615 mm |
Wheelbase | 2445 mm |
Approach Angle | 20.3 degrees |
Ramp Over Angle | 22.2 degrees |
Departure Angle | 37.6 degrees |
Ground Clearance | 187 mm |
Wheel Size | 15-inch (Steel Wheels) / 16-inch (Alloy Wheels) |
Punch Mountaines Banner
Punch Blue Banner