×
Ad

Upcoming Electric SUVs 2026 : టాటా సియెర్రా EV టు కియా సిరోస్ EV.. 2026లో మార్కెట్ షేక్ చేయనున్న టాప్ 5 పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు!

Upcoming Electric SUVs 2026 : 2026లో భారత మార్కెట్లోకి అత్యంత పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. ఇందులో మీ ఫేవరెట్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు ఉందేమో చెక్ చేసుకోండి.

1/5
మారుతి సుజుకి ఇ-విటారా : మారుతి సుజుకి మొట్టమొదటి లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా రాబోతుంది. జనవరి 2026లో మారుతి సుజుకి ఇ-విటారా లాంచ్ కానుంది. డిజైన్ గ్రాండ్ విటారా నుంచి ప్రేరణ పొందింది. 49kWh, 61 kWh అనే ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉంటాయి. వరుసగా 426 కి.మీ, 543 కి.మీల ARAI రేంజ్ అందించగలవు.
2/5
గ్లోబల్ మోడల్‌లో 4WD ఉన్నప్పటికీ, ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) ఆప్షన్ ఉంటుంది. ఫీచర్లలో లెవల్-2 ADAS, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ సీట్లు 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌గా కూడా అందుబాటులో ఉండవచ్చు. ప్రారంభ ధర రూ. 15 లక్షల కన్నా తక్కువ ఉంటుంది.
3/5
టాటా సియెర్రా EV : టాటా సియెర్రా ఈవీ 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. యాక్టివా+ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఐకానిక్ సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్. బాక్సీ డిజైన్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ రెట్రో-మోడరన్ లుక్‌ను అందిస్తాయి. RWD, AWD వేరియంట్‌లు అందుబాటులో ఉంటాయి. ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 500 కి.మీ కన్నా ఎక్కువగా రేంజ్ అంచనా ఉండొచ్చు. 60kWh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్, అడ్వాన్స్ అడాస్ కనెక్ట్ కార్ టెక్ ఫీచర్ లిస్టులో భాగంగా ఉంటాయి. ICE ఇంజిన్‌తో రానుంది. టాటా సియెర్రా ఈవీ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య (సుమారు 1.5 డాలర్లు నుంచి 2 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.
4/5
మహీంద్రా XUV 3XO : మహీంద్రా XUV3XO ఈవీ కారు సబ్-4 మీటర్ సెగ్మెంట్‌తో వస్తుంది. ఆగస్టు 2026 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 34.5kWh, 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌లతో మహీంద్రా XUV400 స్థానంలో ఉంటుంది. రేంజ్ అంచనా 375 కి.మీ నుంచి 456 కి.మీ ఉంటుందని అంచనా. డిజైన్ ICE మోడల్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే, కొత్త LED గ్రిల్ అల్లాయ్ వీల్స్‌తో మోడ్రాన్‌గా కనిపించవచ్చు. ఇంటీరియర్‌లో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్-2 అడాస్ 360-డిగ్రీ కెమెరా ఉంటాయి. సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు 150hpని అందిస్తుంది. ఈ మహీంద్రా ఎస్‌యూవీ ధర రూ. 15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుందని టాటా నెక్సాన్ ఈవీ నేరుగా పోటీ పడుతుందని అంచనా.
5/5
కియా సైరోస్ ఈవీ : కియా సైరోస్ ఈవీ కారు భారత్ సహా ఇతర దేశీయ మార్కెట్లో లాంచ్ కానుంది. కియా సైరోస్ ఈవీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉండొచ్చు. సైరోస్ ఎలక్ట్రిక్ వెర్షన్ హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీతో కలిసి లాంచ్ అవుతుందని అంచనా. బ్యాటరీ ప్యాక్‌ కూడా హ్యుందాయ్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. కియా సైరోస్ ఎలక్ట్రిక్‌ను రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 355 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ రేంజ్ అందించవచ్చు.