BYD Hybrid SUV : SUV మార్కెట్‌లో BYD కొత్త సంచలనం.. ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ దూసుకెళ్లే హైబ్రిడ్ కారు..!

BYD Hybrid SUV : ఇదో సరికొత్త హైబ్రిడ్ కారు.. ఈ BYD టూ ఇన్ వన్ మోడల్ బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్లతో వస్తుంది. రెండూ కలిపి 1200 కిలోమీటర్ల రేంజ్ అందుకోగలదు. పూర్తి ఫీచర్లు, రేంజ్ వివరాలను పరిశీలిద్దాం..

BYD Hybrid SUV

  • భారత మార్కెట్లోకి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ బీవైడీ కారు వచ్చేస్తోంది
  • పెట్రోల్, ఎలక్ట్రిక్ డబుల్ ఇంజిన్లతో బీవైడీ సీల్ యూ కారు
  • ఫుల్ ఛార్జింగ్, ఫుల్ ట్యాంకు పెట్రోల్‌తో 1200కి.మీ రేంజ్

BYD Hybrid SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకించి భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు భారీ క్రేజ్ కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థ బీవైడీ (BYD) కొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ బీవైడీ సీల్ యు కారును భారత మార్కెట్లో ఫస్ట్ టైమ్ ఆవిష్కరించింది. 2026 చివరి నాటికి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

రాబోయే దేశీయ బీవైడీ ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కారు ఇదే కానుంది. ఈ కారులో స్పెషాలిటీ ఒక్కటే.. కాసేపు ఎలక్ట్రిక్ లేదా పెట్రోల్ కారుగా మారిపోతుంది. రెండు రకాల ఇంజిన్లతో అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్, ఫుల్ ట్యాంకు పెట్రోల్ కొట్టించారంటే చాలు.. ఈ SUV ఏకంగా 1,200 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్లగలదు.

ప్రస్తుతం, భారత హైబ్రిడ్ కార్ల మార్కెట్‌లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కేటగిరీలో ఇప్పటికీ చాలా చిన్నది. ఈ విభాగంలో బీవైడీ సీల్ యు కొత్త ఆప్షన్‌గా మారవచ్చు.

ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నా లేదా లాంగ్ టూర్ వెళ్లేవారు అయినా ఛార్జింగ్ స్టేషన్ల గురించి ఆందోళన అవసరం ఉండదు. ఎందుకంటే.. ఈ SUV ప్రత్యేకంగా బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్ రెండింటినీ వినియోగిస్తుంది. తద్వారా లాంగ్ రైడ్ వెళ్లేవారికి రేంజ్ సమస్యలు ఉండవు.

ఎలక్ట్రిక్ మోడ్‌లో ఎంతంటే? :
బీవైడీ సీల్ యు 18.3kWh బ్లేడ్ బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ SUV కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సుమారు 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని కంపెనీ పేర్కొంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణం లేదా సిటీలో చిన్న చిన్న పనులకు పెట్రోల్ ఖర్చు అవసరం ఉండదు. ఈ కారును ఇంట్లో కూడా ఛార్జ్ చేసి వాడుకోవచ్చు. ఈ బ్యాటరీకి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ కూడా అమర్చారు. ఈ రెండూ కారుకు మరింత పవర్ అందిస్తాయి.

Read Also : Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ ట్రిపుల్ ధమాకా.. 3 మడత ఫోన్లు రెడీ.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్!

హైబ్రిడ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే? :
ట్రెడిషనల్ హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజన్ కీలక పాత్ర పోషిస్తోంది. బీవైడీ సీల్ యులో ఎలక్ట్రిక్ మోటార్ అద్భుతంగా ఉంటుంది. సిటీలో డ్రైవింగ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ మోటార్ వరకు అన్నింటా అద్భుతంగా ఉంటుంది.

అదే సమయంలో పెట్రోల్ ఇంజన్ బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. హైవేపై హై స్పీడ్ వెళ్లాలని అనుకుంటే పెట్రోల్ ఇంజన్ నేరుగా వీల్స్‌కు పవర్ అందిస్తుంది. ఈ టెక్నాలజీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు ఎక్కువ మొత్తంలో ఫ్యూయిల్ సేవింగ్ కూడా అందిస్తుంది.

మైలేజ్ అద్భుతం.. ఫ్యూయిల్ ఆదా :
భారీ ఎస్‌యూవీ అయినా ప్రతి 100 కిలోమీటర్లకు కేవలం 4.8 లీటర్ల పెట్రోల్‌ మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే.. సగటు మైలేజ్ లీటరుకు సుమారు 20 నుంచి 21 కిలోమీటర్లు ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా లాంగ్ జర్నీ చేసేవారికి ఫ్యూయిల్ చాలా ఆదా అవుతుంది.

బీవైడీ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అనేది వరల్డ్ వైడ్ ఫుల్ పాపులర్. బీవైడీ సీల్ యులో కూడా ఈ బ్యాటరీ ఉంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) టెక్నాలజీతో పనిచేస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ బ్యాటరీ ట్రెడిషనల్ లిథియం-అయాన్ బ్యాటరీల కన్నా చాలా సేఫ్ కూడా. హీటింగ్ లేదా ఫైర్ బ్లాస్ట్ వంటి రిస్క్ చాలా తక్కువ.